DevidReddy Movie: మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’ (DevidReddy Movie). ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమాను వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. హనుమ రెడ్డి యక్కంటి ( ManchuManoj DevidReddy Director Hanuma Reddy)దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ర్యబోషప్క హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆర్.పార్తీబన్, కాంచన ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ– ‘‘చరిత్రలో బయటకు రాని కొన్ని సంఘటనలు, దారుణాలను ఎదుర్కొనేందుకు ఒక వ్యక్తి నిలబడితే ఎలా ఉంటుందో, ‘మా ‘డేవిడ్‌రెడ్డి’ సినిమాలో చూస్తారు. 1897–1922ల మధ్య కాలంలో జరిగే పీరియాడికల్ యాక్షన్ సినిమా ఇది. బ్రిటిషర్లకు మాత్రమే కాదు..ఇండియన్స్‌కి కూడా డేవిడ్‌రెడ్డి శత్రువే. డేవిడ్‌రెడ్డికి పీస్‌ఫుల్‌గా ఉండటం రాదు. ఏదైనా కొట్టి తెచ్చుకోవడమే. డేవిడ్‌రెడ్డి బైకు పేరు వార్‌డాగ్. అతని చేతిలో ఉండే స్టిక్ పేరు డెత్‌నోట్. ఇవి రెండు డేవిడ్ రెడ్డి ఆయుధాలు. ఇండియాకు స్వాతంత్య్రం అడిగి కాదు కొట్టి తెచ్చుకోవాలి అనేది డేవిడ్ రెడ్డి ఆలోచన. బ్రిటీష్ వాళ్లు ఊళ్లకు ఊళ్లు తగల బెడు తుంటే ఆ హింసను హింసతోనే సమాధానం చెప్పే యోధుడిగా డేవిడ్ రెడ్డి కనిపిస్తాడు. ఇలాంటి ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను నేను చేయగలనని నమ్మి, నాతో సినిమా చేస్తున్న దర్శకుడు హనుమకు థ్యాంక్స్. రాజీపడకుండ నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘డేవిడ్‌రెడ్డి’ సినిమాలో గెస్ట్ రోల్స్‌కి చాన్స్ ఉంది. ఎవరు చేస్తారనేది త్వరలోనే చెబుతాం. ఇక ఈ ‘డేవిడ్ రెడ్డి’ సినిమా నా ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్‌లా ఉంటుంది’’ అని మాట్లాడారు.
డైరెక్టర్ హనుమరెడ్డి యక్కంటి మాట్లాడుతూ– ‘‘రియల్ ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని, ఫిక్షనల్ క్యారెక్టర్‌తో తీసిన సినిమా ‘డేవిడ్‌రెడ్డి’. మనకు భగత్‌సింగ్ ఒకరే. సుభాస్ చంద్రబోస్ ఒకరే. అలా డేవిడ్ రెడ్డి కూడా ఒకరే. డేవిడ్ రెడ్డి నిజమైన పాన్ ఇండియా సినిమా. కథ విని వెంటనే ఒప్పుకున్న మనోజ్‌గారి, ఈ టీమ్‌లో భాగమైన చిత్రయూనిట్ అందరికీ ధన్యవాదాలు’’ అని చెప్పారు.
ప్రొడ్యూసర్ భరత్ మోటుకూరి మాట్లాడుతూ – ‘డేవిడ్ రెడ్డి’ సినిమాను కేవలం మనోజ్ గారు మాత్రమే చేయగలరు. అనేక ఇబ్బందులు పెట్టిన తర్వాత ఒకరి నుంచి పుట్టుకొచ్చే ఆవేశమే ఈ డేవిడ్‌రెడ్డి సినిమా. ఆ ఆవేశమే బ్రిటీష్ వారి మీద తిరగబడేలా చేసింది. ఈ సినిమాకు ఎలాంటి టెక్నీషియ¯Œ ్స కావాలో అలాంటి వారినే పర్పెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నాం. ఈ మూవీ ఆడియన్స్ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు.
ప్రొడ్యూసర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘మనోజ్ గారిని మీరు ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు. డైరెక్టర్ హనుమ నా ఫ్రెండ్. ఒక కసితో ఈ సినిమాను రూపొందిం చాడు. రవి బస్రూర్, సుప్రీమ్ సుందర్..ఇలా ఒక మంచి టీమ్ ను పెట్టుకున్నాడు’’ అని చెప్పారు.
స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ మాట్లాడుతూ – మనోజ్ గారి సినిమాల్లో యాక్షన్ కు స్పెషల్ ఫ్యా¯Œ ్స ఉంటారు. ‘డేవిడ్ రెడ్డి‘ మంచు మనోజ్ కు గొప్ప యాక్షన్ మూవీగా పేరు తెస్తుంది. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.
‘‘కేజీఎఫ్, సలార్’ చిత్రాలకు నేను అందించిన మ్యూజిక్‌ను తెలుగు ఫ్యాన్స్ అభిమానించారు. నా మ్యూజిక్‌కి తెలుగు ఫ్యాన్స్ ఉన్నారని గర్వంగా చెప్పుకుంటాను. ‘డేవిడ్‌రెడ్డి’ సినిమా మ్యూజిక్ పరంగా, అందరికీ ఫేవరెట్ అవుతుంది’’ అని రవిబస్రూర్ చెప్పుకొచ్చారు.

Okay, gàchoi c1.com – a VERY slight typo, but it lands you on the same cockfighting site, gachoic1com.com. Just so you know what you’re getting into. Explore if you must: gàchoi c1.com
OK, so checked out Co Tuong OK at ok22fun. If you’re into chess-like strategy games, this is worth a look. Definitely keeps you thinking, that is all! co tuong ok