VijaySethupathi With ManiRathnam:: హీరో విజయ్‌సేతుపతి, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో తాను సినిమా చేయనున్న విషయాన్న అధికారికంగా ప్రకటించారు విజయ్‌సేతుపతి. గతంలో మణిరత్నం తీసిన మల్టీస్టారర్ మూవీ ‘చెక్క చివంద వానమ్’ సినిమాలో విజయ్‌సేతుపతి ఓ యాక్టర్‌గా చేశారు.
ఈ సారి విజయ్‌సేతుపతియే సోలో హీరోగా మణిరత్నం కాంబినేషనల్‌లో సినిమా రానుంది. ‘థగ్‌లైఫ్’ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత మణిరత్నం ఏ హీరోతో మూవీ చేస్తారు? అనే చర్చ కొన్ని రోజులుగా సాగింది. అయితే ఫైనల్‌గా విజయసేతుపతి ఖరారు అయ్యారు. ఈ సినిమా రొమాంటిక్ జానర్ మూవీలో ఉంటుందట. అంటే..వింటేజ్ మణిరత్నం ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు.
ఇక మణిరత్నంతో సినిమా చేయనున్న విషయాన్ని విజయ్‌సేతుపతి కన్ఫార్మ్ చేశారు. ఓ ఆంగ్లమీడియా సంస్థతో మాట్లాడిన విజయ్‌సేతుపతి, దర్శకుడు మణిరత్నంతో తాను సినిమా చేస్తున్న విషయాన్ని కన్ఫార్మ్ చేసి, ఈ సారి ఓ కొత్తరకం జానర్‌లో సినిమా చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
విజయ్‌సేతుపతి తెలుగులో నటించిన ‘స్లమ్‌డాగ్’, మిస్కిన్ డైరెక్షన్‌లో చేసిన ‘ట్రైన్’ సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. శింబు అసురన్‌లో కూడా విజయ్‌సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, మరోవైపు యాక్షన్ హీరోగా విజయ్‌సేతుపతి తనదైన స్టైల్లో దూసుకెళ్తున్నారు.
«Динамо-Минск» разрушает мифы о закрытости хоккея: команда открыта миру, болельщикам и новым талантам. Подробнее здесь: https://cont.ws/@sirgreensz/3129433