మిసాల పిల్లా…కోపం కొంచెం తగ్గాలే పిల్లా..!

Viswa

Web Stories

Meesaala Pilla: ‘ఏయ్‌ మిసాల పిల్లా…నీకు ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా…’..ఈ సాంగ్‌ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలోనిది. దసరా సందర్భంగా ఈ సినిమా ప్రోమోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ ప్రోమోలో చిరంజీవి–నయనతారల లుక్స్, ఈ ప్రోమో బాగున్నాయి. ఈ పాటను కొంత గ్యాప్‌ తర్వాత ఉదిత్‌ నారాయణన్‌ పాడారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన పాట ఇది. విజయ్‌ పొలాంకి ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. త్వరలోనే ఈ సినిమా లిరికల్‌ వీడియో రిలీజ్‌ కానుంది. రిలీజైన ప్రోమోలో చిరంజీవి గ్రేస్‌ బాగుంది. మెగాఫ్యాన్స్‌ ఆశించిన రితిలో ఈ సాంగ్‌ ఉంది.

చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మన శంకరవర ప్రసాద్‌గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఈ సినిమా క్యాప్షన్‌. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా చేస్తుండగా, వెంకటేశ్, వీటీవీ గణేష్, క్యాథరీన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos