బైరాన్‌పల్లిలో ఛాంపియన్‌ స్వాతంత్ర్య పోరాటం

Viswa

Web Stories

Champion Trailer: శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ మేక హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఛాంపియన్‌ (Champion Traile)’. రోషన్‌ మేక (Roshan Meka) హీరోగా చేస్తున్న రెండో సినిమా ఇది. ప్రదీప అద్వైతం డైరెక్షన్‌లోని ఈ పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘చాంపియన్‌’ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ గురువారం విడుదల చేశారు. ఈ ‘ఛాంపియన్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి రామ్‌చరణ్‌ (Champion Trailer LaunchEvent Ramcharan) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడాడు. తన కెరీర్‌లో రెండో సినిమా ‘మగధీర’ ఎంతటి విజయాన్ని సాధించిందో, అలా రోషన్‌ కెరీర్‌లోని రెండో సినిమా అయినా ‘ఛాంపియన్‌’ కూడా ఆ తరహా విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పాడు. ఇంకా రోషన్‌ ఓ హాలీవుడ్‌ హీరోలా, యూరోపియన్‌ హీరోగా కనిపిస్తున్నట్లుగా కితాబులిచ్చారు రామ్‌చరణ్‌. అలాగే హీరోయిన్‌ అనశ్వర రాజన్‌కు నటిగా మంచి భవిష్యత్‌ ఉంటుందని జోస్యం చెప్పారు చరణ్‌.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంటే…1948లో నిజాం పరిపాలనలో ఉన్న బైరాన్‌పల్లి అనే గ్రామంలో జరిగే కథ ‘ఛాంపియన్‌’ మూవీ, అని ఈ సినిమా ట్రైలర్‌ స్పష్టం చేస్తుంది. ఇందులో మైఖేల్‌ సి.విలియమ్స్‌ అనే ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా రోషన్, నాటకాలు ప్రదర్శించే యువతి చంద్రకళ అనే పాత్రలో మలయాళ నటి అనస్వరా రాజన్‌ నటించారు. నందమూరి కల్యాణ్‌చక్రవర్తి, మురళీశర్మ వంటి వారు ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు. స్పోర్ట్స్‌ ఎలిమెంట్స్‌కి, దేశభక్తి, ప్రేమ అంశాలను మేళవించినట్లుగా తెలుస్తుంది. ‘ఛాంపియన్‌’ ట్రైలర్‌ చూసేందుకు ఆసక్తిగానే కనిపిస్తోంది. స్ట్రాంగ్‌ సబ్జెక్ట్‌ను డీల్‌ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ కూడా సినిమాలో భాగమైనట్లుగా స్పష్టం అవుతోంది.

అశ్వనీదత్, జీ స్టూడియోస్‌ల సమర్పణలో ప్రియాంకా దత్, జీకే మోహన్, ‘జెమిని’ కిరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ డిసెంబరు 25న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు మిక్కీజేమేయర్‌ స్వరకర్త.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Manasa Varanasi Shivani Nagaram Heroine Nabanatesh Latest Pics Krithishetty Ritika Nayak