మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) కుమార్తె విస్మయ మోహన్‌లాల్ (vismaya mohanlal) వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. విస్మయ ఎండితెర ఎంట్రీని కన్ఫార్మ్ చేస్తూ, ‘ఎక్స్’ వేదికగా మోహన్‌లాల్ ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. తమ సొంత నిర్మాణసంస్థ ఆశీర్వాద్ సినిమాస్‌లో ‘తుడక్కం’ (Thudakkam) సినిమా విస్మయ మోహన్‌లాల్‌కు హీరోయినగా తొలిసినిమా. ‘2018’ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టిన జూడ్ ఆంథోని జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ఓ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమని, ఈ చిత్రంలో మోహన్‌లాల్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.
ఇక ఆల్రెడీ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్ (Pranav mohanlal) హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కుమార్తె విస్మయ కూడా వెండితెరపైకి వస్తున్నారు. ఇక హీరోగా మోహన్‌లాల్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఆయన్నుంచి ‘ఎల్2 ఎంపురాన్’, ‘తుడరుమ్’ వంటి బ్లాక్‌బస్టర్ బాక్సాఫీస్ సినిమాలు వచ్చాయి. పీరియాడికల్ ఫిల్మ్ వ్రుషభ షూటింగ్‌ను పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. హ్రుదయపూర్వమ్ అనే సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రిలీజ్‌కు రెండు సినిమాలు ఉండగానే, ద్రుశ్యం3 సినిమా చిత్రీకరణను ఈ ఏడాది అక్టోబరులో మొదలు పెట్టనున్నట్లుగా మోహన్‌లాల్ తెలిపారు. ఇలా ప్రజెంట్ మోహన్‌లాల్ ఫ్యామిలీ అంతా సినిమాల్లో బిజీ బీజీ.