Mokshagna Teja: నందమూరి వారసుడు..ఒకే సారి రెండు సినిమాలు

Viswa
1 Min Read

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ (Mokshagna Teja) మంచి ఊపు మీద ఉన్నట్లు కనిపిస్తున్నాడు. మోక్షజ్ఞ హీరోగా ç‘హను–మాన్‌’ దర్శకుడు ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ వారంలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుంది. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో సుధాకర్‌ చెరుకూరిఈ సినిమాను నిర్మిస్తారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి రానున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లనే లేదు..కానీ అప్పుడే రెండో సినిమాను కూడా రెడీ చేసుకున్నాడు మోక్షజ్ఞ (Mokshagna Teja). ‘తొలిప్రేమ, లక్కీభాస్కర్, సార్‌’ వంటి చిత్రాలను తీసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఓ సినిమా చేయనున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించ నున్నారని తెలిసింది. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇప్పటికే ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా సినిమాలు చేయాలని మోక్షజ్ఞ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *