కథ
Mufasa: The Lion King Review: అమ్మానాన్నలతో సంతోషంగా జీవిస్తుంటాడు ముఫాసా (తెలుగులో మహేశ్‌బాబు (Maheshabu) వాయిస్ ఓవర్ ఇచ్చారు). ఊహించని వరద కారణంగా అమ్మానాన్నలకు దూరమైన ముఫాసాను టాకా (సినిమాలోసత్యదేవ్ పాత్ర) కాపాడతాడు. కానీ టాకా తండ్రి, ఆ రాజ్యానికి రాజైన ఓబాసి ముఫాను తమ గ్రూప్‌లో చేర్చుకునేందుకు నిరాకరిస్తాడు. అయితే టాకా తల్లి ఈషే మాత్రం ముఫాసాను కొడుకుగా స్వీకరిస్తుంది.
అలా ఓ సందర్భంగా ఈషే, ముఫాసా, టాకాలపై తెల్ల సింహాలు దాడి చేస్తాయి. ఆ దాడికి భయపడి సంఘటన స్థలం నుంచి టాకా భయపడి పారిపోతాడు. కానీ ముఫాసా మాత్రం ఆ తెల్ల సింహాలను ఎదిరించి, ఈషేను కాపాడతాడు. కానీ ఈ క్రమంలో తెల్లసింహాల రాజు కిరోషి తనయుడు షాజును చంపేస్తాడు ముఫాసా (Mufasa: The Lion King Review)
తన రాజ్యంపై కిరోషి దాడి చేయడానికి సిద్ధం అవుతున్నాడని తెలుసుకుంటారు ఓబాసి, ఈషే. దీంతో కొడుకు టాకాను, ముఫాసాను మరో చోటుకు వెళ్లి బతకమని, తమను ఎలాగూ కిరోషి చంపేస్తాడని చెబుతారు. వేరు గత్యంతరం లేక ముఫాసా, టాకా మరో చోటుకు బయలుదేరతారు. ఓబాసి, ఈషేలను చంపిన కిరోషి…టాకా..ముఫాసాలను కూడా చంపాలనుకుంటాడు.
AkhilAkkineni: అఖిల్ చేయాల్సిన వందకోట్ల సినిమా క్యాన్సిల్?
ముఫాసా తన కలల రాజ్యం మేలేలే కు చేరుకోవాలని ఆశపడుతుంటాడు. ముఫాసా (Mufasa), టాకా (Taka)లకు తోడుగా షరాబి(ఆడ సింహాం), జోజు (పక్షి), రఫికీ తోడువుతారు. వీరందరికీ లక్ష్యం ఒకటే. మెలేలె రాజ్యం చేరుకోవడం. మరి..ఈ ప్రయాణంలో వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురైయ్యాయి? ముఫాసా, టాకాలకు మధ్యశత్రుత్వం ఎందుకు తలెత్తింది? ముఫాసాను చంపాలని, టాకా ఎందుకు శత్రువైన కిరోషితో చేతులు కలిపాడు? కిరోషిను ముఫాసా ఎలా ఎదుర్కొని రాజు అయ్యాడు? అన్నది మిగిలిన కథాంశం.

విశ్లేషణ
లయన్‌కింగ్ (2019)లో వచ్చిన లయన్‌కింగ్ సినిమాకు ‘ముఫాసా: ది లయన్‌కింగ్’ సినిమా ప్రీక్వెల్. లయన్‌కింగ్ సినిమా చూసిన ప్రేక్షకులు ‘ముఫాసా: ది లయన్‌కింగ్’ సినిమా ఇంకా కనెక్ట్ అవుతుంది.మేలేలే రాజ్యానికి ముఫాసా రాజు కావడంలో ఓ కీలక పాత్ర వహించిన రఫీకీ.. ముఫాసా మనవరాలు– సింబా కూతురు కియారాకు కథ చెబుతుండటంతో సినిమా మొదలవుతుంది. తన తాతయ్య కథను ముఫాసా ఎంతో ఆసక్తిగా వింటున్నట్లుగా ఉంటుంది. అమ్మానాన్నలకు ముఫాసా దూరం కావడం, ఓబాసి రాజ్యంలో ముఫాకు నిలదొక్కుకోవడం, కిరోషి నుంచి ముఫాసా–టాకాలు తప్పించుకోవడం, వంటి సన్నివేశాలతో తొలి భాగం ముగుస్తుంది. ముఫాసా, టాకా, జోజు, రఫీకీ, షరాబిలు కలిసి మేలేలే రాజ్యానికి చేరుకోవడం, వీరిని కిరోషి (తెల్లసింహాల రాజు), అతని బృందం ఫాలో కావడం, చివరల్లో మేలేలే రాజ్యానికి ముఫాసా రాజు కావడంతో కథ ముగుస్తుంది.
Shruti Haasan: రెండు సినిమాలు వదులుకున్న శ్రుతీహాసన్
ముఫాసా, టాకాలకు మధ్య సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎమోషన్..రివేంజ్..ద్రోహం వంటి అంశాలు బాగా పండాయి. కథ అంతా ప్రధానంగా ఈ రెండు పాత్ర ఎమోషన్స్ చూట్టే తిరుగుతుంది. ముఖ్యంగా సెకాండాఫ్‌లో టాకా పాత్ర ఇంపార్టెన్స్ మరింత పెరుగుతుంది. టాకాను విలన్ అని చూపించకుండ…పరిస్థితులే టాకాను విలన్‌గా చేశాయని దర్శకుడు చూపడం, ఒకట్రెండు సన్నివేశాల్లో ముఫాసాను టాకాయే కాపాడటం వంటి సీన్స్‌ని బట్టి కథలో టాకా పార్టు ఇంపార్టెన్స్‌ను అర్థం చేసుకోవచ్చు. ఇక ముఫాసా ప్రే యసి షరాబి, జోజు, రఫీకీ పాత్రల కాస్త ఆలస్యంగా మొదలవుతుంది. ముఫాసా, టాకాల తర్వాత అంతటి ముఖ్యమైన పాత్ర దక్కింది రఫీకీకి.
Sreeleela: పీక్ స్టేజ్‌లో హీరోయిన్ శ్రీలీల కెరీర్…ఒకేసారి ఏడు సినిమాలు
మేలేలే రాజ్యానికి ముఫాసా వెళ్లెంత వరకు అక్కడ చాలా సింహాలు ఉన్నా కూడా, ఓ రాజు అంటూ లేకపోవడం కాస్త విచిత్రంగా ఉంటుంది. ఏదో ముఫాసా కోసమే ఆ రాజ్యం ఎదురుచూస్తున్నట్లుగా కథలో చూపించడం నప్పదు. అలాగే ఓసారి విలన్‌గా మారిన తర్వాత కూడా టాకా, మళ్లీ ముఫాసాకు సాయం చేయడం ఒకింత ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఒక పుంబ (బ్రహ్మానందం వాయిస్ ఓవర్), టిమోన్ (అలీ వాయిస్ ఓవర్)ల, కిరోస్ (రవిశంకర్ వాయిస్ ఓవర్)ల కామెడీ ట్రాక్…ముఫాసా, టాకాలకు ఏటాచ్ అవ్వదు..ఏదో సెపరేట్ ట్రాక్‌లా ఉంటుంది. ఇదో మైనస్‌లా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్‌లో ముఫాసా అమ్మ మేలేలే రాజ్యంలో సడన్‌గా ప్రత్యక్షమవ్వడం అనేది కేవలం ఆడియన్స్‌కు కన్విన్సింగ్‌గా ఉండదు. షరాబి పాత్ర ఎస్టాబ్లిష్‌మెంట్ సరిగా ఉండదు…ఇలాంటి లాజిక్‌లు ఏవీ పట్టించుకోకున్నా కూడా ‘ముఫాసా: ది లయన్‌కింగ్’ సినిమా ఆడియన్స్ అలరిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు భలేగా ఉంటుంది. విజువల్స్, టెక్ని కల్ వేల్యూస్, నిర్మాణ విలువలు సూపర్. బారీ జెన్కిన్స్ డైరెక్షన్ బాగానే ఉంది. సినిమా నిడివి కూడా తక్కవే కాబట్టి ఆడియన్స్ బోర్ ఫీలవ్వరు. మ్యూజిక్ ఒకే. సినిమాటోగ్రఫీ అదుర్స్.
రేటింగ్ 2.75/5