NagaChaitanya Weds SobhitaDhulipala: నాగచైతన్య జీవితం శోభితం

Viswa
2 Min Read
NagaChaitanya Weds SobhitaDhulipala:1

NagaChaitanya Weds SobhitaDhulipala: అక్కినేని నాగచైతన్య జీవితం శోభాయమైనమైంది. నటుడు అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్లల వివాహం డిసెంబరు 4(బుధవారం) హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. డిసెంబరు 4 రాత్రి 8 గంటల 13 నిమిషాల శుభముహూర్తాన అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్లలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఏయన్నార్‌ (అక్కినేని నాగేశ్వరరావు) శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేయబడిన ఏయన్నార్‌ విగ్రహాం సమక్షంలో వీరి వివాహం జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో ఇందు కోసం భారీ పెళ్లి మండపం ఏర్పాటు చేశారు. హిందు సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. ఈ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ అర్థరాత్రి వరకు సంతోషంగా జరిగాయి. (NagaChaitanya Weds SobhitaDhulipala).

Pawan Kalyan HariHaraVeeraMallu: ఎట్టకేలకు క్లైమాక్స్‌కు చేరుకున్న హరిహరవీరమల్లు

వీరి విహహా వేడుకకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరైయ్యారు. ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, వెంకటేష్, జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, రానా, కీరవాణి, అల్లు అరవింద్‌ తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘‘చైతన్య, శోభితల వివాహ వేడుక తమకెంతో ప్రత్యేకమైన ఎమోషనల్‌ మూమెంట్‌ అని, ఏయన్నార్‌ శతజయంతి సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఏయన్నార్‌ విగ్రహం సాక్షిగా చైతన్య, శోభితల పెళ్లి జరగడం సంతోషకరమని నాగచైతన్య ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

ఇక నాగచైతన్య హీరోగా నటించిన ‘తండేల్‌’ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. చందు మోండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించారు.

 

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *