సోలో హీరోగా నాగార్జున సినిమా (Nagarjuna Next Movie) ఇంకా ఏదీ ఖరారు కాలేదు. తమిళ దర్శకుడు నవీన్ ఓ కథ చెప్పాడని నాగార్జున ఓ సందర్భంగా చెప్పినా, ఈ సినిమా వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆ తర్వాత కూడా నాగార్జున కొన్ని కథలు విన్నా…ఆయన్ను ఇంప్రెస్ చేసే కథ అయితే ఏదీ ఆయన చెవిన పడలేదు. దీంతో నాగార్జున సోలో హీరోగా మూవీ అనౌన్స్‌మెంట్ రాలేదు (Nagarjuna Next Movie).
అయితే ఇటీవల దర్శక–నిర్మాత పూరీ జగన్నాథ్ ఓ స్టోరీని రెడీ చేసి, నాగార్జునకు వినిపించారట. ప్రాధ మికంగా నాగార్జున కూడా ఒకే చెప్పారట. గతంలో పూరీ, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన ‘సూపర్,శివమణి’ సినిమా ఫర్వాలేదనిపించాయి. మరి..ఇప్పుడు పూరితో సినిమా అంటే నాగా ర్జునకు బాగానే ఉంటుంది. కానీ ‘లైగర్, డబుల్ ఇస్మార్ట్’ వంటి…వరుస డిజాస్టర్ మూవీస్‌తో పూరీ కోలుకోలేని స్థితిలోఉన్నాడు. ఈ సమయంలో నాగార్జున …పూరి పూర్తి కథకు ఒకే చెబుతారా? అనేది అసలు ప్రశ్న.
కాంబినేషన్‌ను గురించి ఆలోచిస్తే…నాగార్జున మరోసారి తప్పులో కాలేసినట్లే. ‘శివ’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్‌గోపాల్ వర్మకు పిలిచి మరి.. నాగార్జున మంచి అవకాశం ఇస్తే….ఆఫీసర్ లాంటి డిజాస్టర్‌నునాగార్జున చేతిలో పెట్టాడు రామ్‌గోపాల్ వర్మ. మరి…ఒకవేళ పూరీతో నాగార్జున సినిమా చేస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే…కాంబినేషన్స్ పరంగా మరో ఆఫీసర్ రాకూడదని అక్కినేని అభి మానులు కోరు కుంటున్నారు కాబట్టి.
పూరీ బ్లాక్‌బస్టర్ డైరెక్టరే. ‘పోకిరి, బిజినెస్‌మ్యాన్, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్…’ ఇలా ఎన్నో సూపర్‌డూపర్ బ్లాక్‌బస్టర్స్ కొట్టాడు. ఇండస్ట్రీ హిట్స్ అందించాడు. కానీ పూరీ ప్రస్తుతం ఫామ్‌లో లేరు అదే సమస్య.