హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఇప్పటివరకు వచ్చిన ‘సింహా, లెజెండ్, అఖండ’ సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. ముఖ్యంగా వీరి కాంబి నేషన్‌లో 2021లో వచ్చిన ‘అఖండ’ భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు నాలుగు సంవ త్సరాల తర్వాత ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ 2’ చిత్రం రాబోతుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. మరి..ఈ అంచనాలను ‘అఖండ 2’ చిత్రం చేరు కుందా? రివ్యూలో చూద్దాం.
సినిమా: అఖండ 2 (Akhanda 2 Review)
ప్రధాన తారాగణం: నందమూరి బాలకృష్ణ, ఆదిపినిశెట్టి, సంయుక్త, హర్షాలీ మల్హోత్రా, కబీర్‌దుహాన్ సింగ్
దర్శకత్వం: బోయపాటి శ్రీను (Akhanda2 Director BoyapatiSrinu)
నిర్మాణం: ఎం.తేజస్విన నందమూరి, గోపీఆచంట, రామ్ ఆచంట
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్: తమ్మిరాజు
కెమెరా: సి. రామ్‌ప్రసాద్, డి.సంతోష్
నిడివి:2 గంటల 45 నిమిషాలు
విడుదల తేదీ: 12-12-2025
రేటింగ్:2/5
కథ (Akhanda2 Story):
గాల్వాన్‌లోయ (భారత్–చైనా సరిహద్దు ప్రాంతం)లో భారత సైనికుడి చేతిలో చైనా ఆర్మీ జన రల్ చాంగ్ లీ (సంగే సెల్ట్రామ్) కొడుకు చనిపోతాడు. దీంతో భారతదేశంపై ద్వేషం పెంచుకున్న ఆ జనరల్, భారతదేశాన్ని నాశనం చేయాలనుకుంటాడు. ఇందుకోసం చైనా ఆర్మీ మాజీ జన రల్ చంగ్ (సస్మత్ చటర్జీ)తో కలిసి బయోవార్ ప్లాన్ చేస్తాడు. భారతదేశంలోని ప్రతిపక్ష రాజకీ య నాయకుడు అనూప్‌సింగ్‌ఠాకూర్ (కబీర్ దుహాన్ సింగ్) వీరికి సాయం చేస్తాడు. భారత దేశంలో జరిగే మహాకుంభమేళాలోని గంగలో ఓ వైరస్‌ను వ్యాప్తి చేస్తారు. ఈ వైరస్ వల్ల ఎంతో మంది భక్తులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటారు. మరి కొందరు చనిపోతారు. ఈ వైరస్‌కు యాంటీడోట్‌ను తయారు చేస్తుంది డీఆర్‌డీవో యంగ్ సైంటిస్ట్ జనని (హర్షాలీ మల్హోత్రా). దీంతో ఠాకూర్ మనుషులు జననిని చంపాలనుకుంటారు. అప్పుడు ఏం జరిగింది? జననిని, ఆమె పెదనాన్న అఖండ రుద్ర సికందర్ ఘోరా (బాలకృష్ణ) ఎలా కాపాడాడు? అన్నది ‘అఖండ 2’ సినిమాలోని మిగిలిన కథ (Akhanda 2 Review)
Akhanda 2 Review: విశ్లేషణ
దేశభక్తి, దేశ రక్షణ, ఆథ్యాత్మికం, సనాతన హైంధవ ధర్మం, అంతర్లీనంగా రాజకీయాలు, అమ్మ సెంటి మెంట్…వీటన్నింటిని మిళితం చేసి, ‘అఖండ 2:తాండవం’ సినిమా కథను రెడీ చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. అయితే ఈ ఆసక్తికరమైన అంశాలను ‘అఖండ2: తాండవం’ సిని మాలో సరైన రితీలో బ్లెండ్ చేయలేకపోయాడు బోయపాటి.
టిబెట్ బోర్డర్‌లో జరిగే ఓ మారణహోమంతో ‘అఖండ2: తాండవం’ సినిమా మొదలవుతుంది. సినిమా మొదలైన, చాలా సేపటి తర్వాత కానీ వెండితెరపై హీరో కనిపించడు. ఆ తర్వాత ఈ సినిమాలోని ప్రధానమైన ఒక్కోక్క పాత్ర వెండితెరపైకి వస్తుంటుంది. ఒక్కో పాత్రకు ఒక్కో ఇంట్రడక్షన్ సీన్‌తో సినిమా సాగుతూ ఉంటుంది. ప్రీ ఇంట్రవెల్‌కి కానీ కథ ఊపందుకోదు. జననిని అఖండ కాపాడటంతో ఇంట్రవెల్ ముగుస్తుంది. సనాతనధర్మం గురించి అఖండ చెప్పడం, ఆ తర్వాత చైనా ఆర్మీ జనరల్ చాంగ్‌లీ, చాంగ్‌లను అఖండ చంపడంతో సినిమా ముగుస్తుంది.
బోయపాటి సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ మస్తుగా ఉంటాయి. లాజిక్‌లు ఉండవు. రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. ఈ ‘అఖండ 2’ సినిమాలో ఇది చాలా అంటే చాలా శ్రుతి మించి పోయింది. అఖండ ఒక్కడే వెళ్లి చైనా ఆర్మీ టీమ్‌పై ఏటాక్ చేయడం, క్షుద్రమాంత్రికుడు నేత్రను చంపేసీన్ ఇవన్నీ…లార్జర్ దేన్ లైఫ్ సీన్స్. బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రమే నచ్చే సన్నివేశాలు. ఇలాంటివి సినిమాలో చాలానే చూపించాడు బోయపాటి. అయితే సెకండాఫ్‌లో అఖండ సనాతన ధర్మం గురించి చెప్పడం, అమ్మసెంటిమెంట్, అమ్మ అంత్యక్రియలు చేసే సీన్‌లు మాత్రం బాగున్నాయి. సినిమాలో సాదారణ ఆడియన్స్‌కు నచ్చే సీన్స్‌లు చాలా తక్కువగానే ఉన్నాయి. బాలయ్య ఫ్యాన్స్ కి నచ్చే, వాళ్ళు మెచ్చే సీన్స్ స్క్రీన్ నిండుగా, మెండుగా లాజిక్ లెస్ గా ఉన్నాయి.
నటీనటుల పెర్ఫార్మెన్స్
అఖండగా బాలకృష్ణ అత్యద్భుతంగా నటించారు. ముఖ్యంగా తనదైన యాక్షన్ మార్క్ సీక్వెన్స్ లతో తన ఫ్యాన్స్‌ను అలరించాడు. అలాగే బాలకృష్ణ చేసిన మరో పాత్ర ఎమ్‌ఎల్‌ఏ బాల మురళీకృష్ణ పాత్ర మాత్రం తేలిపోయింది. తొలిపార్టు అఖండలో ఈ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. కానీ సెకండాఫ్‌లో ఇంపార్టెన్స్ లేదు. జననిగా హర్షాలీ మల్హోత్రాకు మంచి రోల్ లభిం చింది. ‘అఖండ’ తర్వాత ఈ సినిమాలోని మరో మేజర్ హైలైట్ రోల్ హర్షాలీదే. డీఆర్‌డీవో సెంటిస్ట్ అర్చన గోస్వామిగా సంయుక్త, మాంత్రికుడు విశాచి అలియాస్ నేత్రగా ఆదిపినిశెట్టి పాత్రలను సినిమాలో బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ఈ పాత్రలు సినిమాలో ఉన్నా లేకపోయినా పెద్ద తేడాలేదు. రాజకీయనాయకుడు ఠాగూర్‌గా కబీర్‌దుహాన్ సింగ్ తన రోటీన్ పెర్ఫార్మెన్స్ చేశాడు. కడప కలెక్టర్‌గా రవిప్రకాశ్, భారతప్రధానికి సర్వదామన్ బెనర్జీ, పీఎమ్‌ఓ ఆఫీస్ ఆఫీసర్లుగా పూర్ణ, అవినాష్‌కురువిల్లా,ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా శరత్ లోహిత్య, అఖండ అమ్మ ధరణిగా విజి చంద్రశేఖర్, లార్డ్ శివగా తరుణ్‌ఖన్నాలు వారి వారి పాత్రల మేరకు యాక్ట్ చేశారు (Akhanda2 Cast and Crew). ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ మంచి ఎస్సెట్‌గా నిలిచింది. ఆర్‌ఆర్ బాగుంది. పాటలు కుదర్లేదు. కెమెరా వర్క్ బాగుంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ యావరేజ్. నిర్మాణ విలువలు బాగు న్నాయి. ఎడిటింగ్ ఒకే. చాలా సీన్స్ ట్రిమ్ చేయవచ్చు.
కేవలం బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రమే నచ్చే సినిమా ఇది. లాజిక్‌లు అస్సలు ఆలోచించకూడదు. స్క్రీన్‌పై బాలయ్య యాక్షన్ మ్యాజిక్‌లు చూడటమే. సనాతన హైందవ ధర్మం, రాజకీయాలను మేళవించి, ఓ మంచి డ్రామాను ప్రేక్షకులకు అందించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను విఫలమైయ్యాడు.