‘డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ ఫిల్మ్ తర్వాత కళ్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam) నుంచి మరో మూవీ థియేటర్స్‌లోకి రాలేదు. ప్రస్తుతం అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun S/o Vyjayanthi) సినిమాతో కళ్యాణ్‌రామ్ బిజీగా ఉన్నారు. కళ్యాణ్‌రామ్ నుంచి నెక్ట్స్ థియేటర్స్‌లోకి రాబోయే సినిమా ఇదేనని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా టాకీ పార్టు పూర్తయింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటిని కూడా వీలైనంత తొందరగా షూటిం గ్ చేసి, ఈ ఏడాదే ఈ మూవీని రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
విలన్‌గా సోహైల్ ఖాన్
కళ్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీలో విజయశాంతి, సోహైల్‌ఖాన్, శ్రీకాంత్, పృథ్వీరాజ్ లు ఇతర కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు పోలీస్ పాత్రలో అదరగొట్టిన విజయశాంతి కొంతకాలంతర్వాత మళ్లీ ఓ పోలీసాఫీసర్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఐపీఎస్ ఆఫీసర్ వైజయంతి గా విజయశాంతినటిస్తారు. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్‌లోని ఈ మూవీని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సోహైల్‌ఖాన్ విలన్ రోల్ చేస్తున్నాడు. సోహైల్‌కు తెలుగులో ఇదే తొలి సినిమా కావడం విశేషం.
టాలీవుడ్‌కు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా
క్లైమాక్స్ కోసం 8 కోట్లు
ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరించారు. ఈ ఫైట్‌లో వెయ్యిమందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. దాదాపు 8 కోట్ల రూపాయలతో ఈ మూవీ క్లైమాక్స్‌ను చిత్రీకరించామని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ రానుంది.
ilegu cinmaes