Nani Hit3: నానిని టెన్షన్‌లోకి నెట్టిన సూర్య

Nani Hit3: నాని హిట్‌ 3, సూర్య రెట్రో చిత్రాలు ఒకే రోజు అంటే మే 1న థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతున్నాయి. ఇది ఎవరికో ఒకరికీ మైనస్‌ అవుతుంది.

Viswa
1 Min Read

నాని నిర్మాతగా, దర్శకుడు శేలేష్‌ కొలనుతో నిర్మించిన ‘హిట్, హిట్‌ 2’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. దీంతో ‘హిట్‌’ ఫ్రాంచైజీలో లేటెస్ట్‌ మూవీ ‘హిట్‌ 3’ (Nani Hit3)లో నానియే హీరోగా చేస్తున్నాడు. కెరీర్‌లో ఫస్ట్‌టైమ్‌ ఈ సినిమా కోసం పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు నాని. ‘హిట్‌ 3’ మూవీలో అర్జున్‌సర్కార్‌ అనే రోల్‌లో నాని కనిపిస్తారు.

Akkineni Naga Chaitanya: రెండు హారర్‌ మూవీలకు సైన్‌ చేసిన నాగచైతన్య

‘హిట్‌ 3’ మూవీతో ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా తెలుగులోకి వస్తున్నారు. ‘హిట్‌ 3’కి శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ‘హిట్‌ 3’ మూవీని, మే 1న రిలీజ్‌ చేయనున్నట్లుగా నాని ఆల్రెడీ అనౌన్స్‌ చేశారు.

అయితే ఇప్పటివరకు ఏప్రిల్‌లో రిలీజ్‌ అవుతుందనుకున్న సూర్య ‘రెట్రో’ మూవీ ఇప్పుడు మే1న రిలీజ్‌కు రెడీ అయ్యింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద నాని వర్సెస్‌ సూర్య అయిపోయింది. ఇప్పటివరకు సోలో రిలీజ్‌ డేట్‌ అని సంబరపడిన నానిని, సూర్య సడన్‌గా టెన్షన్‌లోకి నెట్టినట్లయింది.

నానిని తక్కువ చేయడం అని కాదు కానీ..సూర్యకు కూడా తెలుగులో మంచి మాస్‌ ఫాలోయింగ్‌ ఉంది. పైగా కార్తీక సుబ్బరాజు డైరెక్షన్‌ అంటే ‘రెట్రో’ మూవీపై ఆడియన్స్‌లో అంచనాలు ఉంటాయి. సో…మరి… ‘హిట్‌ 3’ బాక్సాఫీస్‌ వద్ద గెలుస్తుందా? లేక సూర్య ‘రెట్రో’ విజయం సాధిస్తుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

 

Please Share
5 Comments