తమిళ దర్శకుడితో నాని (Nani) సినిమా అన్నది ఇప్పటి వ్యవహరం కాదు..మణిరత్నంతో నాని సినిమా గతంలో వార్తలు వినిపించాయి. కానీ కుదర్లేదు. ఆ తర్వాత ‘జైభీమ్’ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్‌లో నాని మూవీ అంటూ వార్తలు. ఇవి వర్కౌట్ కాలేదు. రజనీకాంత్ ‘వేట్టయాన్’ (తెలుగులో ‘వేటగాడు’)మూవీలో రానా చేసిన విలన్ రోల్‌ని, నానికి టీజే జ్ఞానవేల్ ఆఫర్ చేశాడని, అందుకే ఈ మూవీకి నాని ఒప్పుకోలేదని వార్త లొచ్చాయి.
ఈ నెక్ట్స్ తమిళంలో శివకార్తీకేయన్‌తో ‘డాన్’ తీసిన సిబీ చక్రవర్తితో నాని సినిమా అన్నారు. ఇదీ కార్య రూపం దాల్చలేదు. రీసెంట్‌గా ‘హిట్ 3’ ప్రమోషన్స్‌లో భాగంగా, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో ఓ మూవీ కోసం చర్చలు జరిగాయని, అవి వర్కౌట్ కాలేదని నాని చెప్పుకొచ్చారు. లేటెస్ట్‌గా కోలీవుడ్ యంగ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్– నానిల మధ్య ఓ సినిమా కోసం చర్చలు జరిగాయి. కానీ ఈ చిత్రమూ వర్కౌట్ కాలేదు. కానీ ఇది మూడు సంవత్సరాల క్రితం ముచ్చట. మరి.. తమిళ దర్శకుడితో నాని సినిమా చేస్తాడో చూడాలి.
ఇక నానీ లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ మే 1న రిలీజ్ కానుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు.