ఆయా షేర్‌ సాంగ్‌ ..ప్యూర్‌మాడ్‌నెస్‌ ఫర్‌ ఫ్యాన్స్‌

Viswa

Web Stories

Aaya Sher song: నాని బర్త్‌ డే సందర్భంగా విడుదలైన ‘ఆయా షేర్‌’ సాంగ్ (Aaya Sher song) ఇంటర్‌నెట్‌ను షేక్‌ చేస్తుంది. ముఖ్యంగా ఈ సాంగ్‌లో నాని వేసిన హుక్‌స్టెప్‌, సిగ్నెచర్‌ స్టెప్స్‌ నాని ఫ్యాన్స్‌కి హై ఇస్తున్నాయనే చెప్పాలి. ఫిబ్రవరి 24న నాని 42వ బర్త్‌ డే (Nani Birthday). ఈ సందర్భంగానే ‘ది ప్యారడైజ్‌’ సినిమా నుంచి ‘ఆయా షేర్‌’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. తెలంగాణ జానపద గాయకులు అడ్డుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్య ఈ పాడిన ఈ తెలంగాణ ఫోక్‌ సాంగ్‌కు కాసర్లశ్యామ్‌ లిరిక్స్‌ అందించారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌ అనిరుథ్‌ రవిచందర్‌ ‘ది ప్యారడైజ్‌’ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. ‘దసరా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమాను, సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ‘దసరా’ సినిమానూ కూడ నిర్మించింది ఈ నిర్మాతనే.

1980 సికింద్రాబాద్‌ నేపథ్యంతో సాగే పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘ది ప్యారడైజ్‌’ సినిమా. ఇందులో కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోహన్‌బాబు విలన్‌ రోల్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ యువ నటుడు’కిల్‌’ ఫేమ్‌ రాఘవ్‌ జుయల్‌ మరో విలన్‌ రోల్‌ చేస్తున్నారు. మోహన్‌బాబు తనయుడు పాత్రలో రాఘవ్‌ జూయల్‌ నటిస్తున్నాడు. ఇక నాని పాత్ర పేరు జడల్‌. జడల్‌ ఫ్రెండ్‌ బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్‌బాబు యాక్ట్‌ చేస్తున్నాడు. ‘ది ప్యారడైజ్‌’ సినిమా ఆగస్టు 21న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

ఈ సినిమా కాకుండ సుజీత్‌ డైరెక్షన్‌లో ‘బ్లడీ రోమియో’ మూవీ చేస్తున్నాడు నాని. మరో కొత్త సినిమాకు కూడ కమిట్‌ అయ్యాడు. అలాగే నాని బర్త్‌ డే సందర్భంగా చాలా మంది ప్రొడ్యూసర్స్‌ నానికి బర్త్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చివర్లో నాని కొత్త సినిమా అప్‌డేట్స్‌ తెలుస్తాయి.

Please Share
1 Comment
  • Важный момент — волнообразность состояния. На фоне отмены алкоголя или ряда веществ человеку может стать легче на несколько часов, а затем тревога, потливость, тахикардия и бессонница возвращаются. Если не было плана на ближайшие сутки, повышается риск, что человек снова начнёт пить «чтобы отпустило». Поэтому грамотная выездная помощь включает рекомендации на 24–72 часа: что контролировать, как организовать сон, что пить и есть, какие нагрузки исключить и какие симптомы считаются опасными.
    Подробнее можно узнать тут – http://narkologicheskaya-klinika-pushkino12.ru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi Shivani Nagaram