అమ్మోరు తల్లికి సీక్వెల్‌గా మహాశక్తి

SPM
SPM

Web Stories

Nayanathara Mahashakthi: నయనతార, ఆర్‌జే బాలాజీ, ఉర్వశీ ప్రధాన పాత్రల్లో నటించిన డివైన్‌ ఫిల్మ్‌ ‘ముకూతి అమ్మ న్‌’. ఆర్‌జే బాలాజీ డైరెక్టర్‌. వేల్స్‌ ఫిల్మ్స్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా 2020లో డైరెక్ట్‌గా హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమిగైంది. వ్యూయర్స్‌ నుంచి ఈ సినిమాకు మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ లభించింది. తెలుగులో ఈ సినిమా ‘అమ్మోరు తల్లి’ టైటిల్‌తో స్ట్రీమింగ్‌ అయ్యింది.

ఇప్పుడు ముకూతి అమ్మన్‌ (Mookuthi Amman) తెలుగులో ‘అమ్మోరు తల్లి’ సినిమాకు సీక్వెల్‌గా మూకుతి అమ్మన్‌ 2  (Mookuthi Amman 2)వస్తోంది. కానీ ఆర్‌జే బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. సుందర్‌. సి ఈ సినిమాకు దర్శకుడు. దాదాపు వందకోట్ల రూపాయాల భారీ బడ్జెట్‌తో వేల్స్‌ ఫిల్మ్స్‌ ఇంటర్‌ నేషనల్‌ బ్యానర్‌పై ఇషారి కె గణేష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు వందకోట్ల రూపాయాల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు మేకర్స్‌.

దసరా సందర్భంగా ‘మూకుతి అమ్మన్‌ 2’ (Mookuthi Amman2) సినిమాకు తెలుగులో ‘మహాశక్తి’ అనే టైటిల్‌ను ఖరారు చెసినట్లుగా వెల్లడించి, ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. దునియా విజయ్, రెజీనా కాసాండ్రా, యోగి బాబు, ఊర్వశి, అభినయ, రామచంద్ర రాజు, అజయ్‌ ఘోష్, సింగం పులి, విచ్చు విశ్వనాథ్, ఇనియా, మైనా నందిని ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హిప్‌ హాప్‌ ఆది ఈ సినిమాకు సంగీత దర్శకుడు. వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos