‘ఉప్పెన’ బ్యూటీ కి వరుస షాకులు.. మరో ప్రాజెక్ట్ నుండి అవుట్?

Kumar NA

Web Stories

Krithi Shetty : టాలీవుడ్‌లో ‘ఉప్పెన’లాంటి భారీ హిట్‌తో కెరీర్‌ను ఆరంభించి, ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సంపాదించుకున్న నటి కృతి శెట్టి. అయితే, ప్రస్తుతం ఆమె కెరీర్ చాలా డౌన్ ఫాల్ లో ఉంది. వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలు ఈ ‘బేబమ్మ’ను తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి. కోలీవుడ్‌లో పాగా వేయాలని కృతి గట్టిగానే ప్రయత్నిస్తోంది, కానీ అదృష్టం మాత్రం ఆమెకు కలిసి రావడం లేదు (Krithi Shetty upcoming movie).

కార్తీ సరసన నటించిన ‘వా వతియార్‌’ చిత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అటు క్రేజీ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌తో చేస్తున్న ‘లిక్‌’ సినిమా కూడా పోస్ట్‌పోన్ అవ్వడంతో కృతి ఆందోళనలో పడింది. ఈ సినిమాలపైనే ఆమె ఆశలన్నీ ఉన్నాయి. ఇక తాజాగా బాలీవుడ్ లో ఈ హీరోయిన్ మరో షాక్ తగిలింది. వాస్తవానికి కృతి శెట్టి తన ప్రస్థానాన్ని ‘సూపర్ 30’లో ఒక చిన్న పాత్రతో హిందీలోనే మొదలుపెట్టింది. హీరోయిన్‌గా అక్కడ స్థిరపడాలని చూస్తున్న ఆమెకు తాజాగా ఒక చేదు అనుభవం ఎదురైంది. బాలీవుడ్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ దాదాపు కృతి ఖాతాలో పడిందని అనుకుంటున్న తరుణంలో, ఆ అవకాశం అనూహ్యంగా కీర్తి సురేష్‌ను వరించింది (Krithi Shetty latest film news).

ఇటీవల ‘బేబీ జాన్’ ఫలితం ఎలా ఉన్నా, కీర్తి సురేష్‌కు హిందీలో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ ఆమె పాగా వేస్తుండగా, కృతి శెట్టికి మాత్రం అక్కడ అడుగు పెట్టడం కష్టంగా మారుతోంది. తెలుగులో గతంలో ఉన్నంత జోరు ఇప్పుడు కృతికి కనిపించడం లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న మూడు తమిళ సినిమాలు ఎప్పుడు థియేటర్లకు వస్తాయో తెలియని సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం తెలుగులో సరైన ప్రాజెక్టులు లేకపోవడం, తమిళ సినిమాలు లేట్ అవ్వడం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపుతోంది. మరి ఈ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు కృతి రూటు మారుస్తుందా? లేక మరిన్ని వెయిట్ చేసి సక్సెస్ అందుకుంటుందా? అన్నది చూడాలి. గ్లామర్ ఫీల్డ్‌లో టాలెంట్ తో పాటు టైమ్ కూడా కలిసి రావాలి. మరి కృతి శెట్టి తన తదుపరి నిర్ణయాలతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో వేచి చూడాలి (Krithi Shetty new movie update).

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Manasa Varanasi Shivani Nagaram Heroine Nabanatesh Latest Pics Krithishetty Ritika Nayak