Mookuthi Amman2 : జనరల్‌గా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు బడ్జెట్ కేటాయింపులు కాస్త తక్కువగా ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ మార్కెట్‌లో కూడా పెద్ద నంబర్స్ కనిపించవు. కానీ కోలీవుడ్ క్వీన్ నయనతార కొత్త చిత్రం బడ్జెట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాను వందకోట్ల రూపాయాల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
అమ్మోరు తల్లి
నయనతార ప్రధానపాత్రలో ఆర్‌జే బాలాజీ, ఎన్‌జే శరవనన్ డైరెక్షన్‌లో 2020లో ‘ముకుత్తి అమ్మన్’ (Mookuthi Amman) అనే మూవీ రూపొందింది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్ నిర్మాత ఇషారి కె గణేష్ ఈ మూవీని నిర్మించారు. కరోనా సమయం కావడంతో ఈ మూవీని అప్పట్లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేశారు. తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా రిలీజైంది. ఓటీటీలో మంచి హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు ఎలాగైన సీక్వెల్ చేయాలని,
ఆర్‌జే బాలాజీ డిసైడ్ అయ్యాడు.
డైరెక్టర్ చేంజ్
ఆ తర్వాత ఓ కథను రెడీ చేశాడు ఆర్‌జే బాలాజీ, కానీ హీరోయిన్‌గా త్రిషను అనుకున్నాడట. కానీ ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. ఈ లోపు ‘ముకుత్తి అమ్మన్ 2’ (Mookuthi Amman2 )లోనూ నయనతారయే లీడ్ రోల్ చేస్తారని, అధి కారిక ప్రకటన వచ్చింది. దీంతో ‘ముక్కుత్తి అమ్మన్ 2’ విషయంలో ఆర్‌జే బాలాజీ, నిర్మాత ఇషారి కె గణేష్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ‘ముక్కుత్తి అమ్మన్ 2’ సినిమాను సుందర్.సి డైరెక్ట్ చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా అవే నిజమైయ్యాయి.
వందకోట్ల బడ్జెట్ మూవీ
నయనతార లీడ్ రోల్‌లో, సుందర్. సి డైరెక్షన్‌లో ‘ముకుత్తి అమ్మన్ 2’ సినిమా ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. అయితే ఈ సినిమాను వంద కోట్ల రూపాయాల భారీ బడ్జెట్‌తో తీయనున్నామని, నిర్మాత ఇషారి కె గణేష్ చెబుతుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు…ఈ సినిమా ఓపెనింగ్‌కే ఆయన కోటి రూపాయలు ఖర్చు పెట్టడం విశేషం. పైగా తన సినిమా ఓపెనింగ్‌లకు బొత్తిగా రావడం మానేసిన, నయన తార…ముక్కుత్తి అమ్మన్ 2 సినిమా ఓపెనింగ్‌లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సందడి చేశారు. వందకోట్ల రూపాయాలతో చేసే ఈ సినిమా గనక మార్కెట్ పరంగా వర్కౌట్ అయితే..హీరోయిన్స్‌కు ఉమె న్ సెంట్రిక్ సినిమాల పరంగా మంచి డిమాండ్ అయితే ఏర్పడుతుందనుకోవచ్చు.
కథ వర్కైట్ అయితే, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ సినిమాల కలెక్షన్స్ కూడా రూ. 800 కోట్ల రూపాయలు రాబట్టగలవని హిందీ సినిమా ‘స్త్రీ2’ సినిమా నిరూపించింది కదా.