Akhanda 2: హిట్ కాంబినేషన్ బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల లేటెస్ట్ మూవీ ‘అఖండ 2’ (Akhanda 2 Release) . తొలుత ఈ సిని మాను డిసెంబరు 5న రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఆ సమయంలో డిసెంబరు 5న కార్తీ ‘వా వాతి యార్ (తెలుగులో అన్నగారు వస్తారు), డిసెంబరు 6న శర్వానంద్ ‘బైకర్’ సినిమా కూడ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ‘అఖండ 2’ సినిమా డిసెంబరు 5న వస్తుందెమోనని, కార్తీ ‘అన్నగారు వస్తారు’ సినిమాను డిసెంబరు 12కి వాయిదా వేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటం వల్ల, ‘బైకర్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ‘అఖండ 2’ సినిమాకు సోలో రిలీజ్ ఉంటుందని, ఇది ఈ సినిమాకు బాగా కలిసొస్తుందని, నందమూరి అభిమానులు ఆశించారు. కానీ ‘అఖండ 2’ సినిమాకు సోలో రిలీజ్ లేకుండ పోయింది.
ఆర్థికపరమైన చిక్కుముడుల నేపథ్యంలో ‘అఖండ 2’ సినిమాను డిసెంబరు 12కి వాయిదా వేశారు మేకర్స్. దీంతో ‘అఖండ 2’ సినిమాతో పాటుగా, అదే రోజు కార్తీ ‘అన్నగారు వస్తారు’ సినిమా విడుదల అవుతోంది. అలాగే రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ ఒక్కరోజు ఆలస్యంగా, అంటే డిసెంబరు 13న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇలా ‘అఖండ 2’ సినిమాకు సోలో రిలీజ్ దక్కకుండ పోయింది. మరి…ఈ ఇంపాక్ట్ ‘అఖండ 2’ సినిమా కలెక్షన్స్‌పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తిందనుకోవచ్చు.