‘కేజీఎఫ్, సలార్’ సినిమాలను తీసిన దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఎన్టీఆర్ (NTR)తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ను ఇంకా అథికారికంగా ప్రక టించలేదు. కానీ చాలా నెలల క్రితం ఈ సినిమాను ఉద్దేశిస్తూ, ఈ సినిమా టైటిల్ ‘డ్రాగన్’ (Dragon) అంటూ మాట్లాడారు దర్శకుడు రాజమౌళి. తాజాగా ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లోని ‘సలార్’ సినిమాలో నటించిన ప్రుథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా ఎన్టీఆర్ – ప్రశాంత్‌నీల్ (PrashanthNeel) కాంబోలోని సినిమా టైటిల్ డ్రాగన్ అంటూ మాట్లాడారు. అంతేకాదు..ఈ సినిమాలో మలయాళ నటులు టోవినో థామస్, బీజూ మీనన్‌లు నటిస్తున్నట్లు గా కూడా కన్ఫార్మ్ చేశారు ప్రుథ్వీరాజ్ సుకుమారన్. హిందీలో సర్‌జమీన్ అనే సినిమా చేశారు సుకుమారన్. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రమో షన్స్‌లో భాగంగా సుకుమారన్ డ్రాగన్ సినిమాను గురించిన, ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇక ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లోని డ్రాగన్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో రుక్ష్మీణీ వసంత్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను 2026 జనవరికి విడుదల చేయాలనుకున్నారు. కానీ వీలు పడలేదు. దీంతో 2026 జూన్ 25న రిలీజ్ చేయబోతున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
డ్రాగన్ టైటిల్‌పై అప్పుడే అనుమానాలు..
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తమిళ సినిమా డ్రాగన్. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై, సూపర్‌హిట్ కొట్టింది. కానీ తెలుగులో ‘డ్రాగన్’ పేరుతో కాకుండ, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‘ పేరుతో విడుదలైంది. ఈ సినిమాను తెలుగులో మైత్రీమూవీమేకర్స్‌యే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎన్టీఆర్- ప్రశాంత్‌నీల్ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు కాబట్టే, ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’ సినిమాను ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ పేరుతో విడుదల చేశారని అప్పట్లో ఇండస్ట్రీలో చర్చ సాగింది. ఇప్పుడు అదే నిజమైంది.