‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా, బాలకృష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో (NBK Unstoppable)కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ‘అన్‌స్టాపబుల్’ నాలుగో సీజన్ నడుస్తోంది. మొదటి మూడు సీజన్స్ మాదిరిగానే, ఈ సీజన్‌లోనూ ఇండస్ట్రీ టాప్ హీరోలు, ఈ టాక్ షోలో పాల్గొన్నారు. అలాగే విడుదలకు సిద్ధం అవుతున్న సినిమా యూనిట్స్ కూడా ఈ సీజన్‌లో పార్టిసిపేట్ చేశాయి.
అలా ఈ సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా చేసిన ‘డాకు మహారాజ్’ సినిమా జనవరి 12న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ తరుణంలో ఈ చిత్రం దర్శకుడు బాబీ (Director Bobby) చేసిన గత సినిమాల హీరోలను స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ, ఆ హీరోల గురించి, బాబీ అభిప్రాయన్ని అడిగారు బాలకృష్ణ. ఆ సమయంలో స్క్రీన్‌పై చిరంజీవి (వాల్తేరు వీరయ్య), వెంకటేష్ (వెంకీమామ), పవన్‌కళ్యాణ్ (సర్దార్‌గబ్బర్‌సింగ్), బాలకృష్ణ (డాకుమహారాజ్) ఫోటోలు ప్రదర్శితమైయ్యాయి.
Okka NTR Vi Tappa Bobby Direction Chesina Andhari Heros Vi Vesaru.
Chaala Artificial Show 👌.pic.twitter.com/DSNIo56KOn
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) January 3, 2025
కానీ ఆశ్చర్యకరంగా ఎన్టీఆర్ ఫోటో స్క్రీన్‌పై రాకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఎందుకంటే బాబీ (Director bobby Or KS Ravindra) డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ‘జైలవకుశ’ (JaiLavakusa) సినిమా చేశారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన మూవీ ఇది. దర్శ కుడిగా బాబీకి ఈ సినిమా మంచి పేరునే తెచ్చిపెట్టింది. కానీ ఎన్టీఆర్ పేరు, కానీ ఫోటో కానీ ‘అన్ స్టాపబుల్’ ఫోలో ప్రస్తావనకు రాలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఎన్టీఆర్ ఫోటోను వేయలేదని, ఇలా చేయడం సబబు కాదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.
Balakrishna Aditya999: బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలైనట్లేనా..?
అంతేకాదు…ఈ షో మొదలైనప్పట్నుంచి ఎన్టీఆర్ ప్రస్తావన కానీ, ఎన్టీఆర్ సినిమాలు కానీ, ఈ షోలో అతిథులుగా పాల్గొన్న స్టార్స్ దగ్గర్నుంచి కానీ ఎన్టీఆర్ ప్రస్తావన రాకపోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి…ఈ వివాదం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.

మరోవైపు ‘డాకు మహారాజ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం అమెరికా వెళ్లారు బాలకృష్ణ. ఇటువైపు…విదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలను పూర్తి చేసుకుని, శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు ఎన్టీఆర్. ‘డాకు మహారాజ్’ రిలీజ్ తర్వాత ‘అఖండ 2’తో బాలకృష్ణ బిజీ అవుతారు. సంక్రాంతి తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లోని డ్రాగన్ మూవీతో ఎన్టీఆర్ బిజీ అవుతారు. ‘డ్రాగన్’ తొలి షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలో జరగనుందని తెలిసింది.