NTR: హీరో ఎన్టీఆర్ గాయపడ్డారు. ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో పాల్గొనగా, ఎన్టీఆర్‌కు గాయమైంది. దీంతో ఎన్‌టీఆర్‌ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు ఆయన సిబ్బంది. కాగా, ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్‌కు సెట్స్‌కు పెద్దగాయమైందే ప్రచారం తెరపైకి వచ్చింది. సోషల్‌మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఎన్టీఆర్ సిబ్బంది ఈ విషయంపై స్పందించారు. ఎన్టీఆర్‌కు స్వల్ప గాయమైందని, రెండు వారాల విశ్రాంతి అనంతరం ఆయన పూర్తిగా కోలుకుంటారని ఓ నోట్‌ను విడుదల చేశారు. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి, ఆయన అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్ బాగానే ఉన్నారని, వదంతులను నమ్మవద్దని కూడా ఎన్టీఆర్ సిబ్బంది తెలిపారు.
ఇక ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లో ‘డ్రాగన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ యూఎస్‌లో జరగనుంది. అయితే ఈ లోపే గాయపడ్డారు ఎన్టీఆర్. రెండు రోజులు క్రితం ఎన్టీఆర్ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇంతలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.