NTRNeel: హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్‌నీల్ కాంబోలో ‘డ్రాగన్’ అనే పీరియాడికల్ ఫిల్మ్ రానుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే ఎన్టీఆర్ కెరీర్‌లోనిఈ 31వ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ప్రారంభించాలని ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ ఫిక్స్ అయ్యారు. ఇన్ని రోజులు హృతిక్‌రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా కోసం వర్క్ చేశాడు. ఇప్పుడు వార్ 2లో ఎన్టీఆర్ వంతు షూటింగ్ పార్టు పూర్తయిందని తెలిసింది. సాంగ్స్ మినహా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.
Upendra’s UI The Movie Review: ఉపేంద్ర యూఐ మూవీ రివ్యూ
దీంతో తాను హీరోగా ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లోని సినిమా కోసం ఎన్టీఆర్ సిధ్దం కానున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. మేజర్ షూటింగ్ విదేశాల్లోనే ఉంటుందని తెలిసింది. పదిహేను దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణను ప్లాన్ చేశారట. ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌లో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించనున్నారు. మైత్రీమూవీమేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది.