ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ మూవీ ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) (Dragon) షూటింగ్ మొదలైంది. కానీ ఎన్టీఆర్ ఇంకా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవ్వలేదు. ఈ మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్ ఈ నెల 22 నుంచి జాయిన్ అవు తారని మేకర్స్ చెబుతున్నారు.
ఈ గ్యాప్‌లో ‘వార్ 2’ కోసం హృతిక్‌తో కలిసి, బ్యాలెన్స్ ఉన్న సాంగ్‌ను కంప్లీట్ చేస్తారెమో ఎన్టీఆర్.
ఎన్టీఆర్‌నీల్ మూవీని మైత్రీమూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు, 2026 జనవరి 9న రిలీజ్ చేస్తామని (NTRNell Movie Release date) మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ తేదీకి ఈ మూవీ రిలీజ్ కాకపోవచ్చని, ఏప్రిల్ 9, 2026న ఈ మూవీ రిలీజ్ అవుతుందనే ప్రచారం (NTRNell Movie Release date)సాగుతోంది. బుధవారం షూ టింగ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్, రిలీజ్ డేట్ విషయంలో మాత్రం సస్పెన్స్ మెయిన్‌టెన్ చేస్తున్నారు.
రామ్‌చరణ్ పెద్ది (Peddi Releasedate) మూవీ మార్చి 27న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఎన్టీఆర్ నీల్ మూవీ ఏప్రిల్ 9న అంటు న్నారు. ఈ రెండు పెద్ద సినిమాల నిర్మాణలో కామన్ ఉన్నది ఒకరే అది..మైత్రీమూవీమేకర్స్… మరి..ఈ సంస్థ నుంచి కేవలం 12 రోజుల్లో …రెండు పెద్ద సినిమాలు వస్తాయా? అనేది చూడాలి.
కాకపోతే మైత్రీమూవీమేకర్స్‌లోని రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం పెద్ద విశేషం ఏమీ కాదు. 2024 సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో విడుదల అయ్యాయి.
ఇప్పుడు ఏప్రిల్ 10న..అజిత్ ‘గుడ్‌బ్యాడ్ అగ్లీ’, సన్నీడియోల్ ‘జాట్’ ఒకే రోజు విడుదల అవుతున్నాయి. మరి. .రామ్‌చరణ్ ‘పెద్ది’, ‘ఎన్టీఆర్‌నీల్ ‘డ్రాగన్’ మూవీ కూడా 12 రోజుల గ్యాప్‌లోనే విడుదల అవుతా యేమో చూడాలి.
నిజానికి ‘పెద్ది’, ‘డ్రాగన్’ సినిమాల రిలీజ్‌ల పోటీ విషయంలో చర్చ జరుగుతుంది కానీ.. ‘పెద్ది’కి ముందు వారం రోజుల ముందు..‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ ‘టాక్సిక్’ మార్చి 19న రిలీజ్ అవుతోంది. మరుసటి రోజు… రణ్‌బీర్‌కపూర్, ఆలియాభట్, విక్కీకౌశల్‌ల ‘లవ్ అండ్ వార్’ (Love and War Movie Release date) సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలీవుడ్ మూవీ లవ్ అండ్ వార్‌ని కాస్త పక్కన పెట్టినా, యశ్ ‘టాక్సిక్’ సినిమా విషయంలో తెలుగు ఆడియన్స్ కాస్త ఆసక్తికరంగానే ఉంటారు. ఎందుకంటే..కేజీఎఫ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇంకో విషయం ఏంటంటే… టాక్సిక్, డ్రాగన్….సినిమాల కోర్ పాయింట్ డ్రగ్స్ డీలింగ్, డ్రగ్స్ లీడర్స్… ఒకే పాయింట్‌తో వారం గ్యాప్‌లో రెండు పెద్ద సినిమాలొస్తే….ఇద్దరికీ దెబ్బ.