దసరాకు ఓజీ వర్సెస్‌ అఖండ 2…అసలు పోటీ ముందుంది

Viswa

పవన్‌కల్యాణ్‌ ‘ఓజీ’, బాలకృష్ణల ‘అఖండ 2’ సినిమాలు ….రెండు దసరా సందర్భంగా సెప్టెంబరు 25న రిలీజ్‌ అని ఒకే రిలీజ్‌ డేట్‌ ప్రకటించాయి (OG Movie Verses Akhanda2 Movie). అయితే ఈ రెండు భారీ సినిమాలు ఒకేరోజు విడుదల అయితే, కలెక్షన్స్‌ షేర్‌ అయ్యే అవకాశం ఉందని, దీంతో వీటిలో ఏదో ఒక చిత్రం వాయిదా పడుతుందని, ‘అఖండ 2’ సినిమా రిలీజ్‌ వాయిదా పడొచ్చనే టాక్‌ వినిపించింది. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు విభిన్నంగా ఉన్నాయి (OG Movie Verses Akhanda2 Movie).

బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా వాయిదా పడలేదని, సెప్టెంబరు 25నే రిలీజ్‌ అయ్యేందుకు సన్నాహాలు మొదలైయ్యాయని, ఈ ప్రక్రయలో భాగంగానే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌కు చెందిన అగ్రిమెంట్స్‌ జరుగుతున్నాయనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. నిజానికి దసరా సీజన్‌ పెద్ద ఫెస్టివల్‌. తొమ్మిది రోజులు దేవి నవరత్రాలు ఉంటాయి. కాబట్టి…ఈ రెండు సినిమాలూ ఒకే రోజున విడుదలైన, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు.

కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఈ దసరా పండక్కి ఏదో ఒక సినిమా విడుదల అయితే, ఆ సినిమా కాస్త యావరేజ్‌గా ఉన్నా కూడా…ఫెస్టివల్‌ సీజన్‌ కాబట్టి, హిట్‌ స్టేటస్‌ను సులభంగా చేరుకుంటుంది. సూపర్‌ హిట్‌గా నిలిచిన పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ..‘అఖండ 2’ (Akhanda2), ‘ఓజీ (OG)’ సినిమాలు ఒకే రోజున విడుదలై, ఏదో ఒక సినిమా హిటై్టతే, మరో సినిమాకు తప్పకుండ డ్యామేజ్‌ జరుగుతుంది. కలెక్షన్స్‌ తక్కువగా వస్తాయి.

Balakrishna Akhanda2 and Pawankalyan OG
Balakrishna Akhanda2 and Pawankalyan OG

దసరా సీజన్‌ కాబట్టి…కాస్త డివైన్‌ లుక్‌ ఉండే, ‘అఖండ 2’ సినిమాకే ఎక్కువ చాన్సెస్‌ ఉన్నాయి హిట్‌ కావ డానికి. పైగా…సీక్వెల్‌ హైప్‌ ‘అఖండ’ సినిమాకు తప్పకుండ ప్లస్‌ అవుతుంది. తెలుగు బాక్సాఫీస్‌ షేక్‌ చేసిన ‘బాహుబలి 2, పుష్ప 2, కేజీఎఫ్‌ 2’…వంటి చిత్రాలు సీక్వెల్స్‌నే కదా. కానీ..‘ఓజీ’ పరిస్థితి అలా కాదు.

‘అఖండ 2’ సినిమా ముందుగా వాయిదా అని, ఇప్పుడు సెప్టెంబరు 25నే రిలీజ్‌కు రెడీ అవుతుండటం వెనక కొన్ని కారణాలు ఉండి ఉండొచ్చు. అక్టోబరు 2న ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమా రిలీజ్‌ అవుతోంది. రిషబ్‌ శెట్టి హీరో కమ్‌ డైరెక్టర్‌గా చేస్తున్న ఈ మూవీ ‘కాంతర’కు ప్రీక్వెల్‌. ‘అఖండ 2’ఈ సినిమాలో కూడా దైవత్వం, ఆథ్యాత్మికత ఉన్నాయి. అక్టోబరు 2న ‘కాంతార:చాప్టర్‌1’ రిలీజ్‌ కానున్నట్లు రిషబ్‌శెట్టి ప్రక టించారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాల వల్ల ‘కాంతార: చాప్టర్‌ 1’ సినిమా థియేటర్స్‌కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ‘అఖండ 2’ సినిమాను సెప్టెంబరు 25నే రిలీజ్‌ చేసి, దసరా వీకెండ్‌ని క్యాష్‌ చేసుకోవాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *