ఎట్టకేలకు అఫీషియల్‌గా ప్రకటించిన సమంత

Viswa
Samantha maa inti Bangaram cinema Shooting Started

Web Stories

Maa Inti Bangaram Update: సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మా ఇంటి బంగారం’. గత ఏడాది సమంత బర్త్‌ డే సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సిని మా చిత్రీకరణ అయితే మాత్రం ఈ వారంలోనే ప్రారంభమైంది. సమంత పాల్గొంటుడుంగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్‌.

ఇక ‘మా ఇంటి బంగారం’  (Maa Inti Bangaram) సినిమాను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించి, ఈ సినిమా పూజా కార్యక్రమం ఫోటోలను షేర్‌ చేశారు. సమంత నిర్మాణసంస్థ ట్రాలాలా పిక్చర్స్‌ పతాకంపై రాజ్‌ నిడుమోరు, హిమాంక్‌ దువ్వురూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంతతో పాటుగా, దిగంత్, గుల్షన్‌ దేవయ్య, గౌతమి, మంజుషా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు (Maa Inti Bangaram Cast and Crew). ‘ఓ బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరోయిన్‌ సమంత, దర్శకురాలు నందినీరెడ్డిల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే, ఫ్యామిలీ యాక్షన్‌ డ్రామా సినిమా ఇది. ఇందులో సమంత గృహిణి పాత్రలో నటిస్తున్నారు.

ఇక సమంత సొంత నిర్మాణసంస్థ ట్రాలాలా పిక్చర్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటున్న రెండో సినిమా మా ఇంటి బంగారం. తొలి సినిమాగా ‘శుభం’ వచ్చింది. ఇందులో సమంత గెస్ట్‌ రోల్‌ చేశారు. ఇప్పుడు మా ఇంటిబంగారం సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేస్తున్నారు. నిజానికి ట్రాలాలా పిక్చర్స్‌ పతాకంపై నిర్మించబడాల్సిన తొలి సినిమా ‘మా ఇంటిబంగారం’నే. కాక పోతే, ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త ఆలస్యం కావడంతో, శుభం సినిమా విడుదలైంది. ఇక ‘మా ఇంటి బంగారం’ సినిమాను వచ్చే వేసవి సందర్భంగా థియేటర్స్‌లో రిలీజ్‌ చేయాలను కుంటన్నారు మేకర్స్‌.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos