కొంతగ్యాప్ తర్వాత పవన్‌కల్యాణ్ (Pawankalyan) హీరోగా నటించిన ‘హరిహరవీరమల్లు’ (HariHaraVeeraMallu First Review) సినిమా కొన్ని గంటల్లో థియేటర్స్‌లో ప్రదర్శితం కానుంది. పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత, ఆయన్నుంచి వస్తున్న తొలి సినిమా ‘హరిహరవీరమల్లు’. పైగా పవన్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. అలాగే పవన్ కల్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమా ఇది. ఇంకా పవన్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ సెల్స్ బిజినెస్ జరిగిన చిత్రం ఇది. ఈ సినిమాకు ఇప్పటికే దాదాపు రూ. 40 కోట్ల రూపాయాలు ప్రీ సేల్స్ రూపంలో వచ్చాయని ట్రేడ్ వర్గీయులు చెబుతున్నారు. ఆల్రెడీ హరిహరవీరమల్లు సినిమా బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. దీన్ని బట్టి..ఈ సినిమా పై ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ తరుణంలో ఈ సినిమా గురించిన ప్రీ అండ్ ఫస్ట్ రివ్యూలో కొన్ని ఆసక్తకర మైన విషయాలను తెలుసుకుందాం (HHVMReview)
పవన్‌కల్యాణ్ హరిహరవీరమల్లు సినిమా క్యాస్ట్ అండ్ క్రూ:HariHaraVeeraMallu Cast and Crew
‘హరిహరవీరమల్లు సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇప్పుడు థియేటర్స్‌లోకి రాబోతున్నది ‘హరిహరవీరమల్లు’ సినిమా తొలిపార్టు ‘హరిహరవీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ మూవీ.
ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ హీరోగా నటించగా, నిధీ అగర్వాల్ హీరోయిన్‌గా చేశారు. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపిస్తారు. హరిహర వీరమల్లు పాత్రలో పవన్‌కల్యాణ్, పంచమి పాత్రలో నిధీ అగర్వాల్, మొఘల్ ఎంపరర్ ఔరంగజేబుగా బాబీ డియోల్ నటించారు. ఆదిత్యా మీనన్, విక్రమ్ జిత్, సత్యరాజ్, కబీర్‌బేడీ, అప్పయ్య పి శర్మ, సుబ్బరాజు, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సచిన్ ఖేద్కర్, నర్గీష్ ఫక్రీ, సునీల్, నాజర్, పూజితా పొన్నాడ, మకరంద్‌దేశ్ పాండేలు…ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
పవన్‌కల్యాణ్ హరిహరవీరమల్లు ఎక్స్‌క్లూజివ్ అండ్ సూపర్ ఫోటో గ్యాలరీ
క్రిష్ (జాగర్లమూడి రాధాక్రిష్ణ) దర్శకత్వంలో ఈసినిమా ప్రారంభమైంది. ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన ఏఎమ్‌రత్నం తనయుడు దర్శక-నిర్మాత జ్యోతిక్రిష్ణ ఈ సినిమాను పూర్తి చేశారు. మధ్యలో కొన్ని వ్యక్తిగతమైన, వ్రుత్తిపరమైన కారణాల చేత, ఈ సినిమా నుంచి క్రిష్ తప్పు కోవడం జరిగింది. దీంతో జ్యోతి క్రిష్ణ ఈ సినిమాను పూర్తి చేశారు. ఎమ్‌ఎమ్ కీరవాణి ఈసినిమాకు సంగీత దర్శకుడు. మనోజ్ పరమహంస సినిమాకు సినిమాటోగ్రాఫర్. తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్. దాదాపు రూ. 300 కోట్ల రూపాయాల బడ్జెట్‌తో, ఈ హరిహరవీరమల్లు సినిమాను ఏఎమ్ రత్నం, అద్దంకి దయాకర్‌రావు నిర్మించారు. ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూ బై ఏ సర్టిఫికేట్ లభించింది. ఈ సినిమా నిడివి 2 గంటల 43 నిమిషాలు. తొలిభాగం 1 గంట 26 నిమిషాలు. రెండో భాగం రెండో భాగం 1 గంట 18 నిమిషాలు ఉంటుంది.
కథ గురించి….
‘హరిహరవీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమా కథ 1684 నుంచి ప్రారంభం అవుతుంది. 17వ శతాబ్దంలో విజయవాడలోని కొల్లూరు వజ్రపు గనుల్లో లభ్యమైన కోహినూర్ వజ్రం ఎలా నిజాం నావాబు చెంతకు చేరింది. అక్కడ్నుంచి ఎలా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గరకు వెళ్లిం ది? ఈ వజ్రాన్ని దొంగిలించడానికి హరిహరవీరమల్లు (రాబిన్‌హుడ్ తరహా లాంటి వ్యక్తి. అంటే..సంపన్నులను దోచుకుని, పేదలకు సహాయం చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి) అనే వ్యక్తి ఏ విధంగా ప్రయత్నాలు చేశాడు? ఆ వజ్రాన్ని దొంగతనం చేయమని అతనికి ఎవరు చెప్పారు?రాజనర్తకి పంచమికి వీరమల్లు ఏ విధంగా సహాయం చేశాడు? ఈ క్ర మంలో పంచమి గురించి అతనికి తెలిసిన నిజాలు ఏమిటి? అన్నదే ఈ సినిమా కథ. అలాగే మొఘలుల కాలంలో హిందూలపై ఔరంగజేబు విధించిన జిజియా పన్ను, ఈ పన్ను వల్ల హిందువులు ఎదుర్నొన్న బాధలు..వంటి అంశాలపై కూడా ఈ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. మరి..ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో చూడాలి.
సూపర్బ్‌క్లైమాక్స్!
హరిహరవీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమాకు ఆయువుపట్టులాంటిది ఈ సినిమా క్లైమాక్స్. ఈ సినిమా క్లైమాక్స్‌లో 18 నిమిషాల పాటు వచ్చే వార్ సీక్వెన్స్ ఈ సినిమాకు మేజర్ హైలెట్. ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ మొత్తాన్ని స్వయంగా పవన్‌కల్యాణ్‌యే కొరియోగ్రఫీ చేయడం విశేషం. దాదాపు రూ. 25 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సీక్వెన్స్ కోసం మేకర్స్ దాదాపు 60 రోజులు షూటింగ్ చేశారు. అదీ మండుటెండలో.
అంటే..మే టైమ్‌లో అన్నమాట.

ఈ ఒక్క ఫైట్ సీక్వెన్స్ మాత్రమే కాదు…ఈ సినిమాలో మరో ఐదు ఫైట్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. మొత్తం ఆరు ఫైట్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా సూపర్భ్‌గా ఉండబోతుంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ పని చేశారు. ఇక ఈ సినిమాకు మరో ప్రాణం ఎమ్‌ఎమ్ కీరవాణి మ్యూజిక్, మనోజ్ పరమహంస సిని మాటోగ్రఫీ.తోటతరణి సెట్ వర్క్‌ల గురించి కూడ, ఆడియన్స్ మాట్లాడుకుంటారు. చార్మినార్ సెట్ నేపథ్యంలో వచ్చే మరో ఫైట్ మరో హైలెట్.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన వివరాలు, వివిధ ప్రెస్‌మీట్స్‌లో సినిమా యూనిట్ చెప్పిన విశేషాల, సంగతుల నుంచి సేకరించబడ్డాయి అని గమనించగలరు. పూర్తి రివ్యూ రేపు ఇవ్వబడుతుంది.