‘హరిహరవీరమల్లు స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ ట్విట్టర్‌ రివ్యూ

Viswa
Pawankalyan Hariharaveeramallu Release date

HHVM X Review: సాయిధరమ్‌తేజ్‌ హీరోగా చేసిన ‘బ్రో’ సినిమాలో పవన్‌కల్యాణ్‌ మరో లీడ్‌ క్యారెక్టర్‌ చేసి, స్క్రీన్‌పై కనిపించాడు. ఇది రెండు సంవత్సరాల క్రితం. అప్పట్నుంచి..వెండితెరపై పవన్‌కల్యాణ్‌ మరోసారి స్క్రీన్‌పై కనిపించలేదు. తాజాగా పవన్‌ హీరోగా చేసిన ‘హరిహరవీరమల్లు’ మూవీ తొలిపార్టు ‘హరిహరవీరమల్లు స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ (Hariharaveeramallu Sword verses Spirit) సినిమా ప్రిమియర్స్‌ను జూలై 23న ప్రదర్శించారు. జూలై 24న (Hariharaveeramallu Movie Release date) ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. ప్రిమియర్స్‌, ప్రీ సేల్స్‌ రూపంలోనే, విడుదలకు ముందే ‘హరిహరవీరమల్లు’ సినిమా దాదాపు రూ. 50 కోట్లను కొల్లగొట్టింది. ఇది పవన్‌ కెరీర్‌లోనే ఓ రికార్డు. పవన్‌కల్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇది. అలాగే పవన్‌ కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియన్‌ మూవీ ఇది. తొలి పీరియాడికల్‌ ఫిల్మ్‌ కూడా. ఈ తరుణంలో ‘హరిహరవీరమల్లు స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ సినిమాపై అంచనాలు ఉంటాయి. ఈ తరుణంలో ప్రిమియర్స్‌ సినిమా చూసిన, కొందరు నెటిజన్లు స్పందించారు. మరి..ట్విటర్‌ రివ్యూలో ఎలా ఉందో చూడండి.

‘హరిహరవీరమల్లు స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ సినిమా కోసం వేసిన టైటిల్‌ కార్డ్‌ ఆడియన్స్‌కు, ముఖ్యంగా పవన్‌ ఫ్యాన్స్‌కి మంచి కిక్‌ ఇచ్చింది. అలాగే సినిమా టైటిల్‌ కార్డు కూడా ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఇంట్రోఫైట్‌, ఇంట్రవెల్‌ ఫైట్‌, చార్మినార్‌ ఫైట్‌, కుస్తీ సీన్‌లు ఆడియన్స్‌కు బాగా నచ్చాయ నే టాక్‌ వినిపిస్తోంది. అలాగే కొల్లగొట్టినాదిరో సాంగ్‌ కూడా. ఇవన్నీ తొలిభాగంలో వచ్చేవే. అలాగే నిధీ అగర్వాల్‌ క్యారెక్టర్‌తో వచ్చే ఓ ట్విస్ట్‌ కూడా ఫర్వాలేదంటున్నారు. కోహినూర్‌ డైమండ్‌ అంశంతో ఇంట్రవెల్‌ వస్తుంది.

సెకండాఫ్‌ చాలా ఇంటెన్స్‌తో మొదలైనప్పటికీని, కథలో కొంత సాగదీత ఉందని, ఫలితంగా ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో సెకండాఫ్‌ విఫలమైందని నెటిజన్లు ట్వీట్స్‌ వేస్తున్నారు. క్లైమాక్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాకు ఆయుపట్టులాంటిది క్లైమాక్స్‌ అని, ఈ క్లైమాక్స్‌కు తానే కొరియోగ్రఫీ చేశానని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. అయితే ఈ పవన్‌కల్యాణ్‌ ఆలోచనలు ఆడియన్స్‌ అంచనాలను అందుకోలేకపోయాయనే టాక్‌ వినిపిస్తోంది. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ బాగోలేదని ఎక్కువమంది పెదవి విరుస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఈ సినిమా పవన్‌కల్యాణ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్, నిధీ అగర్వాల్‌, బాబీ డియోల్‌ల యాక్టింగ్‌ తోపాటుగా, కీరవాణి సంగీతం ఈ సినిమాకు మేజర్‌ హైలైట్‌గా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఇలా మొత్తానికి పవన్‌కల్యాణ్‌ హరిహరవీరమల్లు సినిమాకు ప్రిమియర్స్‌లో డీసెంట్‌ టాక్‌ వినిపించింది.

 

 

 

 

 

 

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *