Pawankalyan Upcomeing Movies: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగడానికి ముందు పవన్‌కల్యాణ్ (Pawankalyan) కమిటైన ‘హరిహరవీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ సినిమాల చిత్రీకరణలు పూర్తయ్యాయి. ‘హరిహర వీరమల్లు’ సినిమా థియేటర్స్‌లో విడుదలై, డిజాస్టర్‌గా నిలిచింది. మంచి పాజిటివ్ బజ్‌తో ‘ఓజీ’ చిత్రం ఈ సెప్టెం బరు 25న విడుదల కానుంది. ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ అవుతుంది.
అయితే పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత, కొత్త సినిమాలకు ఒప్పుకోలేదు. రాజకీయాల్లో తాను చాలా బిజీగా ఉన్నానని, భవిష్యత్‌లో సినిమా ల్లో నటించడం కుదరకపోవచ్చని, కాకపోతే తనను చేరదీసిన సినిమా ఇండస్ట్రీకి నిర్మాతగా, చేరువుగానే ఉంటానని, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తానని ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పవన్‌కల్యాణ్ చెప్పుకొచ్చారు.
అలాగే తన రాజకీయపార్టీ జనసేన కోసం అవసరమైన ఆర్థిక నిధులను సమకూర్చుకోవడంలో తనకు సినిమాలే ఆదాయవనరని కూడా పవన్‌కల్యాణ్ మరో సందర్భంలో చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో హీరోగా నటించేందుకు పవన్‌కల్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేక పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమవుతారా? అనే విషయంపై సరైన స్పష్టత రావాల్సి ఉంది. మ రోవైపు కన్నడ ప్రముఖ నిర్మాణసంస్థ కెవిన్ ప్రొడక్షన్స్ నిర్మాతలు ఇటీవల ఉస్తాద్‌భగత్ సింగ్ సినిమా సెట్స్‌లో పవన్‌కల్యాణ్‌ను కలిశారట. సినిమా చేసేందుకు పవన్‌తో సంప్రదింపులు చేశారట. అలాగే ఓ తమిళ రీమేక్ సినిమాలో పవన్‌కల్యాణ్ నటించనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. పవన్‌తో సినిమా చేసేందుకు సముద్రఖని కూడా ఆసక్తి చూపిస్తున్నారట. గతంలో వీరి కాంబినేషన్‌లోనే ‘బ్రో’ అనే సినిమా వచ్చింది. ఇందులో సాయిధరమ్‌తేజ్ మరో లీడ్ రోల్ చేసిన విషయం విదితమే.