ప్రభాస్ (Prabhas) హీరోగా చేసిన ‘బాహుబలి’ (Baahubali) సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ మూవీనో అందరికీ తెలిసిందే. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైంది. అయితే ఈ రెండు భాగాలును కలిసి, ఇప్పుడు ఒకే భాగంగా ‘బాహుబలి ది ఎపిక్’ (BaahubaliTheEpic) పేరిట ఈ అక్టోబరు 31న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ ఎడిటింగ్ వర్క్ మొదలైంది. లేటెస్ట్‌గా ‘బాహుబలి ది ఎపిక్’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. విడుదలైన ఈ టీజర్‌లో ప్రత్యేకంగా డైలాగ్స్ అయితే ఏవీ లేవు. విజువల్స్ మాత్రం బాగున్నాయి. త్వరలో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ ట్రైలర్‌ను ఎలాంటి డైలాగ్స్‌తో కట్ చేస్తారనే ఆసక్తి అయితే అందరిలో నెలకొని ఉంది.
బాహుబలి సినిమాలోప్రభాస్ హీరోగా చేయగా, రానా దగ్గుబాటి, అనుష్కాశెట్టి, తమన్నా, సత్యరాజ్, నాజర్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఎమ్‌ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు. అలాగే బాహుబలి ది ఎపిక్ సినిమాలో, గత సినిమాలు అయిన ‘బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్’లలో లేని సన్నివేశాలు ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఒకవేళ న్యూ విజువల్స్ ఎక్కువగా ఉంటే బాహుబలి ది ఎపిక్ సినిమాను థియేటర్స్‌లో చూసేందుకు ఆడియన్స్ తప్పక వస్తారు. మరి..ఇది జరుగు తుందెమో చూడాలి. అలాగే బాహుబలి ది ఎపిక్ సినిమా టీజర్ ప్రమోషన్స్‌లో ప్రభాస్, అనుష్కాశెట్టి, తమన్నా…వంటి వారు ఎంత ఉత్సాహంగా పాల్గొంటారనే ఆసక్తి అయితే ఆడియన్స్‌లో ఉంది. ఇందుకోసం ఈ చిత్రం నిర్మాతలు శోభుయార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌లు అయితే కష్టపడుతున్నారు.
మరోవైపు మహేశ్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. ఈ చిత్రం మార్చి 25, 2027లో విడుదల అవుతుందనే ప్రచారం సాగుతోంది.