Prabhas Fauzi First look: ప్రభాస్ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘ఫౌజి’ (Fauzi) అనే టైటిల్ ఖరారైంది. గురువారం ఈ ‘ఫౌజి’ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు.
‘‘పద్మవ్యూహాన్ని చేధించిన అర్జునుడు
పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు
గురువులేని ఏకలవ్యుడు
పుట్టుకతోనే అతనో యోధుడు..’’ అంటూ ప్రభాస్ ‘ఫౌజి’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
‘మన చరిత్రలో దాగిన అధ్యాయాల్లోని అత్యంత ధైర్యవంతుడైన సైనికుడి కథ ఇది’
‘మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932’
‘ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ ఎలోన్’
‘ఏ బెటాలియన్ హూ వాక్స్ ఎలోన్’
…ఈ తరహా లైన్స్ ‘ఫౌజి’ సినిమాలోని ప్రభాస్ (Prab క్యారెక్టరైజేషన్‌ను గురించి చెప్పే విధంగా, ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇక అక్టోబరు 23 (గురువారం) ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఫౌజి’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పీరియాడికల్ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్‌ఖేర్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నారు. ఓ గూఢచారిగా ప్రభాస్ పాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయి. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్‌లు ఈ ‘ఫౌజి’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ‘ఫౌజి’ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుందని తెలిసింది. దేశభక్తి ప్రధానాంశంగా సాగే ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల చేస్తే, బాగుంటుందని ‘ఫౌజి’ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఫౌజి సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రావాల్సి ఉంది.
