కల్కి 2 షూటింగ్ స్టార్ట్ చేసిన నాగ్ అశ్విన్..!

Kumar NA

Web Stories

Prabhas kalki 2898 AD 2 shooting start : ‘కల్కి 2898 AD’ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన చిత్రం. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు కలిసి నటించడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని భవిష్యత్ నేపథ్యంలో అద్భుతంగా తెరకెక్కించారు. విజువల్స్, యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్క లిసి ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించాయి. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ఇప్పుడు అందరి దృష్టి ‘కల్కి 2’ మీదే ఉంది. ఈ సీక్వెల్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని సమాచారం. నాగ్ అశ్విన్ ఇప్పటికే కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలోని శంకర్ పల్లిలో భారీ సెట్ నిర్మించి అక్కడే షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మొదటి భాగంలో కమల్ హాసన్ ‘సుప్రీం యాస్కిన్’ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. రెండో భాగంలో యాస్కిన్, భైరవ (ప్రభాస్), అశ్వత్థామ మధ్య జరిగే పోరాటం మరింత భారీగా ఉండబోతుందని టాక్. ఈ పార్ట్‌లో మరిన్ని పురాణ అంశాలు, భవిష్యత్ ప్రపంచానికి సంబంధించిన సన్నివేశాలు ఉండబోతున్నాయి.

మొదటి భాగంలో మిగిలిన ప్రశ్నలకు ఈ పార్ట్‌లో సమాధానాలు దొరికే అవకాశం ఉంది. భారీ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘కల్కి 2’ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi Shivani Nagaram