Pradeep Ranganathan Dude Telugu Trailer: యూత్‌పల్స్‌ను కరెక్ట్‌గా పట్టే తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan )లేటెస్ట్ మూవీ ‘డ్యూడ్’. మమితా బైజు ఇందులో హీరోయిన్. కీర్తీశ్వరన్ ఈ సినిమాకు దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం దీపావళి సందర్బంగా ఈ నెల 17న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. కాగా, ఈ సినిమా తమిళ, తెలుగు ట్రైలర్స్‌ను విడుదల చేశారు మేకర్స్ (Pradeep Ranganathan Dude Telugu Trailer).
యూత్‌ఫుల్ అంశాలు ట్రైలర్‌లో మెండుగానే కనిపిస్తున్నాయి.
‘పక్కోడి ఫీలింగ్స్‌ని క్రింజ్‌గా చూడటమే ఇప్పుడు ట్రెండ్,
వీడొక పనికిమాలినవాడు..వీడికి నువ్వొక అసిస్టెంట్ పనికిమాలినదానివా?
ఈ బాడీతో పదిమందిని కొట్టగలా..?
ఇకపై ఎప్పుడూ దమ్ముకొట్టాలనిపించినప్పుడు..అలాంటప్పుడు చాక్లెట్ తిను.
మన మధ్య ఈ లవ్ అనేది సెట్ అవ్వదు…!
ఓడిపోతునే ఉన్నావేరా..!
కానీ నన్ను ఎందుకు వదిలేసావో రీజన్ మాత్రం చెప్పు…ఇక్కడ్నుంచి వెళ్లిపోతా!
తాళికి ఎలాంటి మర్యాద లేదు..దాని వెనకాల ఉన్న అమ్మాయి ఫీలింగ్స్‌కే మర్యాద!
ఇలాంటి యూత్‌పుల్ డైలాగ్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ‘డ్యూడ్’ సినిమా అంతా లవ్, బ్రేకప్, ఫీలింగ్స్ మీదనే రన్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే రోజు ….తెలుగులో సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘తెలుసు కదా’ సినిమా కూడా విడుదల అవుతోంది. ఈ సినిమాకు ముందు రోజు అంటే అక్టోబరు 16న మిత్రమండలి, అక్టోబరు 18న కిరణ్ అబ్బవరం ‘కె– ర్యాంప్’ సినిమాలు థియేటర్స్‌లోకి వస్తున్నాయి.
ప్రదీప్‌రంగనాథన్ నుంచి తెలుగులోకి వచ్చిన గత రెండు సినిమాలు ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ ‘డ్యూడ్’ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.