Mrunal Thakur Love: సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్లు సాధారణంగా తమ పర్సనల్ లైఫ్ గురించి, ముఖ్యంగా బ్రేకప్స్ గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. తన గతం గురించి, తన మాజీ ప్రియుడి ప్రవర్తన గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన మాజీ ప్రియుడితో బంధం ఎందుకు తెగిపోయిందనే విషయంపై మృణాల్ క్లారిటీ ఇచ్చింది (Mrunal Thakur Love).
“నేను చాలా ముక్కుసూటిగా ఉంటాను, నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ అతడు నన్ను తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూసేవాడు. ముఖ్యంగా నాకు ఇష్టమైన నటనను వదిలేయాలని కండిషన్ పెట్టాడు. నా వ్యక్తిత్వాన్ని, నా వృత్తిని గౌరవించని ఆ ‘కురచ మనస్తత్వం’ చూసి బాధ కంటే జాలి వేసింది. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేశాను” అని మృణాల్ ధైర్యంగా చెప్పుకొచ్చింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ మరియు కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రేమలో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ పుకార్లపై కూడా మృణాల్ ఘాటుగానే స్పందించింది. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని స్పష్టం చేసింది (Mrunal Thakur Comments).
ఆధారాలు లేని వార్తలను సృష్టించి ప్రచారం చేయొద్దని కోరింది. తన కెరీర్‌పై మాత్రమే ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్లు వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూ ద్వారా మృణాల్ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పింది. ప్రేమ పేరుతో స్వేచ్ఛను హరించే బంధంలో ఇరుక్కుపోవడం కంటే, ధైర్యంగా బయటకు వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే ఉత్తమమని ఆమె నిరూపించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మృణాల్, వ్యక్తిగత జీవితం కంటే వృత్తి పరమైన విజయాలకే ప్రాధాన్యత ఇస్తోంది.
Great insights on pharmacokinetic bioavailability and active compound titration. It is refreshing to see such detailed pharmacological breakdowns rather than generic summaries.