Love Insurance Kompany : ‘లవ్‌టుడే, డ్రాగన్ (తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్), డ్యూడ్ ….వంటి సినిమాలతో తెలుగులో మంచి పాపులర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకుంటున్నారు హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఈ యంగ్ హీరో నటించిన తాజా మూవీ ‘లైక్’ (Love Insurance Kompany Movie)(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఇందులో ప్రదీప్ రంగనాథన్‌కు జోడీగా కృతీశెట్టి నటించారు. విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకుడు. నయనతార నిర్మాత. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను రిలీజ్‌రిలీజైంది. నటుడు–నిర్మాత రానా, ఈ సినిమా తెలుగు టీజర్‌ను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు. ఈ టీజర్‌లో ఈ కింది డైలాగ్స్ ఉన్నాయి.
ఉందండి…ఈ లవ్ ఏట్ ఫస్ట్ సైట్ అనేది ఇంకా ఉందండి…
తల నుంచి కాలి వేలి వరకు ఒక ఫీలింగ్ వచ్చింది..మావా….
మావ ఇన్ని దాటి నువ్వు నీ పిల్లతో ఎలా కలుస్తావ్ రా…
ఇంత చేయగలిగిన ఆ ప్రపంచం…ఏంతైనా చేయగలదు
2040 టైమ్‌లైన్‌లో ఈ సినిమా కథనం సాగుతున్నట్లుగా విడుదలైన టీజర్ స్పష్టం చేస్తోంది. ఆ కాలంలో ఉండే ఫార్వార్డ్ రిలేషన్‌షిప్స్, లవ్‌లో ఉంటే కొత్త తరహా విధానాలు…వంటి అంశాల నేపథ్యంతో ఈ సిని మా కథనం సాగుతుందని తెలుస్తోంది. ఈ లైక్ సినిమా ఈ నెల 10న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
లైక్ సినిమా ఇప్పడి కాదు..గత ఏడాది సెప్టెంబరులోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత అక్టోబరులో రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఆ నెక్ట్స్ 2026 ఫిబ్రవరి రిలీజ్ అనుకున్నారు. మళ్లీ ఈ నెల 3న రిలీజ్‌కు ప్లాన్ చేసి, తుదకు, ఈ నెల 10న ఫైనల్ రిలీజ్ డేట్‌ను కన్ఫార్మ్ చేశారు. ఈ జెన్ జీ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లే, ఈ సినిమా కథనం ఉందన్నట్లుగా తెలుస్తోంది. మరి..ఆడియన్స్ ఈ సినిమా ఎంత మేరకు అలరిస్తుందనేది చూడాలి.