please subscribe to Tollywoodhub YouTube channel

యాప్‌ రిజల్ట్స్‌తో లవ్‌ బ్రేకప్‌…2040 లవ్‌స్టోరీ..

Viswa

Web Stories

Love Insurance Kompany Trailer: ‘లవ్‌టుడే, డ్రాగన్‌ (తెలుగులో రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌), డ్యూడ్‌’ వంటి చిత్రాలతో ప్రదీప్‌ రంగనాథన్‌ ( Pradeep Ranganathan ) యూత్‌ ఆడియన్స్‌కు మరింత దగ్గర అయ్యారు. ఆ కుర్ర హీరో నుంచి రాబోతున్న మరో సినిమా ‘లవ్‌ ఇన్యూరెన్స్‌ కంపెనీ’ (ఎల్‌ఐకే) (Love Insurance Kompany ). ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించింది. యోగిబాబు, ఎస్‌జే సూర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విఘ్నేష్‌ శివన్‌ (Vignesh Shivan) దర్శకత్వంలో నయనతార, లలిత్‌కుమార్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 10న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. తాజాగా ఈసినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

కథ మన ఫ్యూచర్‌లో అంటే…2040లో జరుగుతుంది. టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందిన తర్వాత, అప్పటి పరిస్థితుల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఓ ట్రెండీ లవ్‌స్టోరీగా ఈ మూవీ ఉండ బోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో వాసు పాత్రలో ప్రదీప్‌ రంగనాథన్, ధీమ పాత్రలో కృతీశెట్టి యాక్ట్‌ చేస్తున్నారు. ప్రియుడు కంటే ఎక్కువగా, యాప్‌నే (లైక్‌ యాప్‌) నమ్మే..ఓ అమ్మాయి జీవితం ఏమైందా? ఆమె ప్రియుడు ఆమెకు ఎలా బుద్ధి చెప్పాడు? అనే పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది. అలాగే ధీమ నమ్మే యాప్‌ ‘లైక్‌’ ఓనర్‌ను కూడా హీరో దెబ్బతీసే యాంగిల్‌లో ఈ సినిమా కథనం సాగుతుందని, విడుదలైన, ఈ సినిమా ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. ఈ ట్రైలర్‌లోని డైలాగ్స్‌ ఇలా..ఉన్నాయి.

‘మన లైఫ్‌లో ముఖ్యమైనవి ఏమైనవి ఉన్నాయో…అవన్నీ ఇన్యూరెన్స్‌ చేస్తున్న ఈ లోకంలో…., నేను..ఈ లవ్‌ను ఇన్సూరెన్స్‌ చేయడానికి ఏదైనా దారి ఉందా…., ఇప్పుడు దారి ఉంది… లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ..

‘నా యాప్‌ దేవుడ్నాంటిది…’

‘ఒక లైక్‌..ఒక షేర్‌ రావడం అంటే ఎంత కష్టమైన పనో తెలుసా…’

‘ధీమ నేను నిన్ను ఎప్పుడూ హ్యాపీగా చూస్తుండాలి…దాని కోసం నేను ఏమైనా చేస్తాను..’

‘వద్దంటే…వదిలేసి వెళ్లిపోవచ్చుకదా…వాస్‌’

‘ఇంతకుముదు కులం కోసం ఒప్పుకోలేదు..జాతకం కోసం ఒప్పుకోలేదు..ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు..ఊర్లో వాళ్లు ఒప్పుకోలేదు…చుట్టూలు ఒప్పుకోలేదు..ఫ్రెండ్స్‌ ఒప్పుకోలేదు..అమ్మ ఒప్పుకోలేదు..అబ్బ ఒప్పుకోలేదు..అని బ్రేకప్‌ చెప్పేవారు…ఇప్పుడు..యాప్‌ ఒప్పుకోలేదని బ్రేకప్‌ చెప్తున్నారా..’, ‘ఏంటి..డిజైన్‌ డిజైన్‌గా ఆలోచిస్తున్నారా…ఎలా బ్రేకప్‌ చెప్పాలని..మింగేయ్‌..’

‘ఒక హార్ట్‌ చేయగలిగేది…ఏ యాప్‌ చేయలేదని నేను ప్రూవ్‌ చేస్తా….’

ఇక ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. గత ఏడాదే రిలీజ్‌ కావాల్సింది. ఫైనల్‌గా ఈ ఏడాది ఏప్రిల్‌ 10న రిలీజ్‌కు సిద్ధమైంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi