ప్రీమియర్స్‌ వల్ల బాగుపడ్డ ఒక్క స్టార్‌ హీరో ఉన్నాడా?

Viswa

పెద్ద హీరోల సినిమాలకు ప్రీమియర్స్‌ వేయడం వల్ల ఒరుగుతున్నది ఏమీ లేదు. రిలీజ్‌కు ముందే ఓ పెద్ద సినిమా ప్రిమియర్స్‌ (Premiere Shows) వేస్తున్నారంటే….ఆ సినిమాపై టీమ్‌ చాలా కాన్ఫిడెంట్‌తో ఉన్నారని అర్థం. అలా చేస్తున్నప్పుడు ఆడియన్స్‌లోనూ అంచనాలు పెరిగిపోతాయి. పైగా అర్థరాత్రి షోలు అంటే ఆడియన్స్‌….అప్పటికే రోజంతా ఏదో ఒక పని చేసి, వచ్చి థియేటర్స్‌లో కూర్చుంటారు. పైగా నిద్రను బలవంతంగ ఆపుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి మానసిక పరిస్థితుల్లో సినిమా చూసే ఆడియన్స్‌కు నెక్ట్స్‌ లెవల్‌ కంటెంట్‌ కావాలి. లేదా…బాహుబలి, పుష్ప సినిమాల మాదిరి సీక్వెల్‌ హైప్‌ అన్నా ఉండాలి. ఇలా ఏదీ లేకుండ స్టార్‌ హీరోల ప్రిమియర్స్‌ వేస్తే మాత్రం ఏ మాత్రం వర్కౌట్‌ కాని పరిస్థితి.

మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’ సినిమాకు అర్థరాత్రి ప్రీమియర్స్‌ వేస్తే ఏమైంది? నైజాంలోనే రూ. 8 కోట్ల లాస్‌. ప్రభాస్‌ ‘కల్కి2898ఏడీ’ సినిమాకు ఎర్లీ మార్నింగ్‌ ప్రిమియర్స్‌ వేస్తే ఏమైంది..టీమ్‌ అనుకున్న బాక్సాఫీస్‌ రిజల్ట్‌ అయితే రాలేదు. ‘దేవర’ సినిమాకు ప్రిమియర్స్‌ వేస్తే…డివైడ్‌ టాక్‌. ఫెస్టివల్‌ సీజన్‌, పైగా ఫ్యాన్స్‌ ప్రోత్సాహంతో ఈ సినిమా ఎలాగో అలా గట్టేకగలిగింది. ఇలా ప్రీమియర్‌ షోలతో లాభ పడ్డ ఏ స్టార్‌ హీరో అన్నా ఒక్కరు ఉన్నారా? అనేది డౌటే.

చిన్న సినిమాలకు ప్రిమియర్స్‌ వేస్తే ఒక వేళ అవి బాగుంటే, ఆడియన్స్‌కు ఆ రీచ్‌ వెళ్లడానికి ప్రిమియర్స్‌ దోహదపడతాయి. కానీ స్టార్‌ హీరోల సినిమాలంటే ఆడియన్స్‌ ఎలాగూ థియేటర్స్‌కు వస్తారు. రిలీజ్‌ రోజే రాకపోవచ్చు..కానీ వీకెండ్‌లోపు థియేటర్స్‌ను చూస్తారు. అలాంటప్పుడు స్టార్‌ హీరోల సినిమాలకు ప్రీమియర్స్‌ వేయడంలో అర్థం లేదు.

ఇప్పుడు హరిహరవీరమల్లు (Hariharaveeramall సినిమా రిజల్ట్‌ విషయంలోనూ ప్రిమియర్స్ ప్రభావం బాగా పడింది. సినిమా ఫస్టాఫ్‌ బాగానే ఉందని మెజారిటీ ఆడియన్స్‌ ఫీలైయ్యారు. పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ యూనినిమస్‌గా బాగుందని చెప్పారు. సెకండాఫ్‌ బాగోలేదు కానీ…పవన్‌ ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు ఉన్నాయి. కానీ.. మార్నింగ్‌ షో పడే సమయానికే సినిమా మొత్తం బాగోలేదన్న టాక్‌ సోషల్‌ మీడియా పుణ్యమా అని, జనాల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా హరిహరవీరమల్లు సినిమా వీకెండ్‌ బుకింగ్స్ పెద్ద మొత్తంలో డ్రాప్‌ అయ్యాయి. ఇది సినిమా యూనిట్‌కు పెద్ద లాస్‌. ప్రిమియర్స్‌, పెంచుకున్న టికెట్‌ రేట్స్‌, ప్రీ సేల్స్‌ రూపంలో రూ. 50 కోట్లు వచ్చి ఉండొచ్చు. కానీ బడ్జెట్‌ రూ. 250 కోట్ల రూపాయలు అని మర్చిపోకూడదు కదా.

చిన్న సినిమాల విషయంలోనూ ప్రీమియర్స్‌ వర్కౌట్‌ కాలేదు. ‘క’ వంటి ఒకట్రెండు సినిమాలు వర్కౌట్‌ అయ్యాయంటే..అది ఫెస్టివల్‌ సీజన్‌. ఆ ఫెస్టివల్‌కి రిలీజైన తెలుగు హీరో సినిమా ఒక్కటే. ఆ ముందు రోజు కిరణ్‌ అబ్బవరం ఎమోషనల్‌ స్పీచ్‌. ఇలా చాలా కారణాలు దోహదపడ్డాయి. అదే కిరణ్‌ అబ్బవరం ‘దిల్‌ రుబా’ సినిమాకు ప్రీమియర్స్‌ వేస్తే, సినిమా డిజాస్టర్‌. ఇప్పటికన్నా నిర్మాతలు స్టార్‌ హీరోల సినిమాల ప్రీమియర్స్‌ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. గ్లాసుడు రుచిగల పాల కన్నా, ఎక్కువమంది (ఎగ్జిబిటర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌..) దాహం తీర్చే బిందెడు నీళ్లు మిన్నా.

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *