బడ్డీ కామెడీ మిత్రమండలి సినిమా రివ్యూ

Viswa

Web Stories

సినిమా: మిత్రమండలి (Mithra Mandali Review)
ప్రధాన తారాగణం:ప్రియదర్శి, రాగ్‌ మయూర్, విష్ణు ఓఐ, ప్రసాద్‌ బెహరా, వెన్నెల కిశోర్, సత్య, వీటీవీ గణేష్, నిహారిక ఎన్‌ఎమ్‌
దర్శకుడు: విజయేందర్‌.ఎస్‌
నిర్మాణం: బన్నీ వాసు, కల్యాణ్‌ మంతెన, భాను ప్రతాప, విజయేందర్‌రెడ్డి తీగల
సంగీతం: ఆర్‌ఆర్‌ ధ్రువన్‌
ఎడిటింగ్‌:పీకే
నిడివి: 2 గంటల 18 నిమిషాలు
విడుదలతేదీ: 16 అక్టోబరు 2025 (Mithra Mandali ReleaseDate)
రేటింగ్‌:2/5

కథ

జంగ్లీ పట్టణంలో చైతన్య (ప్రియదర్శి), అభి (రాగ్‌ మయూర్‌), సాత్విక్‌ (విష్ణు ఓఐ), రాజీవ్‌ (ప్రసాద్‌ బెహ రా)..అల్లరి చిల్లరిగా తిరిగే ఫ్రెండ్స్‌. వీరంతా ‘మిత్రమండలి’. ఓ సారి అభి, సాత్విక్‌లు స్వేచ్ఛ (నిహారిక ఎన్‌ఎమ్‌)ను చూసి ప్రేమిస్తారు. స్వేచ్ఛను నేను లవ్‌ చేస్తున్నా నంటే, నేను లవ్‌ చేస్తున్నానంటూ గొడవ పడతారు. దీంతో చైతన్య కల్పించుకుని, అభి– సాత్విక్‌లను గొడవ పడొద్దని చెప్పి, అసలు స్వేచ్చ ఎవర్నీ ఇష్టపడుతుందుతో తెలుసు కుందామని చెబుతాడు. ఇలా స్వేచ్ఛ జాయిన్‌ అయిన ఇంగ్లీష్‌ కోచింగ్‌ సెంటర్‌లోనే మిత్ర మండలి టీమ్‌ అంతా జాయిన్‌ అవుతుంది.

ఈ క్రమంలో కులం కోసం ఎంతకైనా తెగించే తుట్టెకులం నారాయణ (వీటీవీ గణేష్‌) కుమార్తెనే స్వేచ్ఛ అని మిత్రమండలి టీమ్‌కు తెలుస్తుంది. దీంతో ‘మిత్రమండలి’ టీమ్‌ అంతా షాక్‌ అవు తారు. మరి…ఆ తర్వాత ఏం జరిగింది? తన కుమార్తె స్వేచ్ఛ తప్పిపోయిందని ఎస్‌ఐ సాగర్‌ (‘వెన్నెల’ కిశోర్‌)కు నారాయణ ఎందుకు కంప్లైట్‌ ఇచ్చాడు? ‘మిత్రమండలి’ టీమ్‌లో స్వేచ్ఛ నిజంగా ఎవర్నీ ప్రేమించింది? ఎమ్‌ఎల్‌ఏ టికెట్‌ కోసం నారాయణ–ఫ్రీడమ్‌ రాజు (సత్య ప్రకాశ్‌)ల మధ్య ఉన్న గొడవ ఏమిటి? ఈ గొడవల్లో ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ (హాస్యనటుడు సత్య) ప్రాము ఖ్యత ఏమిటి? అనేది థియేటర్స్‌లో చూడాలి.

విశ్లేషణ

సినిమాలో కథ లేదని, జస్ట్‌ నవ్వు కోవడం కోసమే తీశామని, మొదట్నుంచి చిత్రంయూనిట్‌ చెబుతూనే ఉంది. దీంతో కథ, లాజిక్‌ల గురించి ఆడియన్స్‌ ఆలోచించాల్సిన అవసరం లేదు.ఓన్లీ కామెడీ. కానీ ‘మిత్రమండలి’ సినిమాలో కామెడీ అంతగా వర్కౌట్‌ కాలేదనే చెప్పాలి.

బడ్డీ కామెడీ జానర్‌కు ‘జాతిరత్నాలు’ సినిమాను ఓ బెంచ్‌ మార్క్‌గా క్రియేట్‌ చేసి పెట్టు కున్నారు ఆడియన్స్‌. బడ్డీ కామెడీతో వచ్చిన ‘మిత్రమండలి’ సరిగా ఆకట్టుకోలే కపోయింది. ఇంట్రవెల్‌ ముందు వచ్చే ట్విస్ట్‌ కూడా ఊహించగలిగిందే. సత్యచేసిన ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ మేజారిటీ ఆడియన్స్‌కు నచ్చకపోవచ్చు. పులిహోర సీన్,జీవన్‌ చేజ్‌ సీన్, ఫ్రెండుకు ఫ్రెండుకు ఫ్రెండురా సీక్వెన్స్, ఇందులో టీమ్‌ చెప్పిన సోషల్‌ సెటైర్‌ ఏదీ…ఆడియన్స్‌ను ఏగై్జట్‌ చేసేలా ఉండదు. నాలుగైదు యాక్షన్‌ సీక్వెన్స్‌లైతే బాగున్నాయి. కానీ సినిమా హిట్‌ కావడానికి ఈ కామెడీ డోస్‌ సరిపోదు.

హీరో క్యారెక్టరైజేషన్‌లో బలం లేదు. తొలిభాగంలో హీరో ఓ సైడ్‌ క్యారెక్టర్‌ మాదిరి ఉంటాడు. ‘వెన్నెల’ కిశోర్‌ను దర్శకుడు సరిగా వినియోగించుకోలేకపోయాడు. మేజర్‌ క్యారెక్టర్స్‌ మధ్య సరైన కాంబినేషన్‌ సీన్స్‌ కూడా లేవు. ఓ దశలో కథ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్‌ సడన్‌గా మాయమవుతుంటాయి. ఇలా మిత్రమండలి సినిమా టైమ్‌పాస్‌లా అని పిస్తుంది. కానీ ఓ మంచి కామెడీ సినిమా చూశానే అనుభూతిని అయితే పూర్తిగా కల్పించదు.

నటీనటులు-సాంకేతిక నిఫుణులు

చైతన్య క్యారెక్టర్‌లో ప్రియదర్శి నటించాడు. ఫస్ట్‌ హాఫ్‌లో పులిహోర, క్లైమాక్స్‌లో 3 నిమిషాల స్పీచ్‌ తప్ప ఏం లేదు. రాగ్‌ మయూర్, విష్ణులకు మంచి రోల్స్‌ లభించాయి. ఉన్నంతలో మెప్పి ంచే ప్రయత్నం చేశారు. రాజీవ్‌గా ప్రసాద్‌ బెహరా జస్ట్‌ ఒకే. స్వేచ్ఛగా నిహారిక ఉన్నంతలో మెప్పించారు. తుట్టె గోవర్ధన్‌గా జీవన్, ఫ్రీడమ్‌ రాజుగా సత్య ప్రకాష్‌లు వారి వారి పాత్రల మేరకు చేశారు. పోలీస్‌ ఆఫీసర్‌ సాగర్‌గా వెన్నెల కిశోర్, తుట్టే నారాయణగా వీటీవీ గణేష్‌ వారి పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు అనుదీప్, హాస్యనటుడు సుదర్శన్, బ్రహ్మానందం లు గెస్ట్‌ పాత్రలకే పరిమితం అయ్యారు.

ఓ సినిమాకు కథ ఇంపార్టెంట్‌. సరే..కథ లేనప్పుడు అందులోని మూమెంట్స్, కామెడీ అన్న బాగుండాలి. కానీ ఈ విషయంలో దర్శకుడు విజయేందర్‌ ఫ్లాప్‌ అయ్యాడు. నిడివి ఉన్నదే తక్కువ. అలాంటప్పుడు రిపీట్‌ సీన్స్‌ ఉంటే, కచ్చితంగా ఆడియన్స్‌కు బోర్‌ కొడుతుంది. స్పూఫ్, సెటైర్‌ కామెడీని కొత్తగా ఏం చూపించలేదు. ధ్రువన్‌ మ్యూజిక్, ఆర్‌ఆర్‌ ఫర్వాలేదు. కానీ ఈ సినిమాకు బలం కాలేకపోయాయి. కెమెరా వర్క్‌ బాగుంది. నిర్మాణ విలువల యావ రేజ్‌.

ఫైనల్‌గా..: ‘మిత్రమండలి’లో కథ లేదు. ఫన్‌ డోస్‌ సరిపోలేదు. టైమ్‌పాస్‌ కోసమైతే ఓ సారి చూడొచ్చు. ‘జాతిరత్నాలు’తో పోలిక అస్సలు వద్దు.

 

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos