డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, వర్సటైల్ యాక్టర్ విజయ్‌సేతుపతి కాంబినేషన్‌తో ఓ మూవీ (Puri Jagannadh Beggar) రానుంది. ఇద్దరు ఇండస్ట్రీలో తమ సత్తా నిరూపించు కున్నవారే. సో…వీరి కాంబినేషన్‌లోని మూవీపై ఇండస్ట్రీలో అంచ నాలు ఉన్నాయి. పైగా వీరి కాంబోలోని మూవీకి ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్,ఈ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జూన్ నుంచి ప్రారంభించాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. పూరీ కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ ఈ మూవీని నిర్మిస్తారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
‘లైగర్, డబుల్‌ఇస్మార్ట్’ వంటి డిజాస్టర్ మూవీస్ తర్వాత పూరీ జగన్నాథ్ చేయనున్న మూవీ ‘బెగ్గర్’. మరి.. ఈ సినిమాతో అయిన పూరీ బౌన్స్‌బ్యాక్ అవుతారామో చూడాలి. 2026లోనే ఈ మూవీ రిలీజ్ కావొచ్చు.