Pushpa2 Collections: ‘పుష్ప ది రూల్’ సినిమా కలెక్షన్స్ బాక్సాఫీస్ రికార్డులను తిరిగరాస్తున్నాయి. ‘పుష్ప ది రూల్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా చిత్ర నిర్మాణసంస్థ మైత్రీ మూవీమేకర్స్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబరు 4న ప్రదర్శితమైన ప్రీమియర్స్‌తో కలిపి ఈ వసూళ్లు వచ్చాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన మూవీ రికార్డు గతంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కలిసి నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాపై ఉండేది. ఇప్పుడు ఈ రికార్డు అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమాకు చేరింది. ప్రీ సేల్స్‌లోనే ‘పుష్ప2’ సినిమాకు వందకోట్ల రూపాయల వసూళ్ళు వచ్చినట్లయింది. అంతేకాదు..నైజాం, సీడెడ్, ఆంధ్ర ఏరియాల్లో అత్యధిక వసూళ్ళు సాధించిన తొలి మూడు స్థానాల్లో పుష్ప2కు చోటు దక్కింది.
మరోవైపు నార్త్, ఓవర్‌సీస్‌లో ‘పుష్ప2’ సినిమా కుమ్మేస్తుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో పుష్ప 2 వసూళ్ళు ఓ రేంజ్‌లో ఉన్నాయి. తొలిరోజు అత్యధిక వసూళ్ళు సాధించిన హిందీ చిత్రం రికార్డు షారుక్‌ఖాన్ ‘జవాను’ పేరిట ఉండేది. అప్పట్లో ఈ సినిమా తొలిరోజు దాదాపు 65 çకోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే ‘పుష్ప2’ సినిమాకు హిందీలో తొలిరోజు దాదాపు 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంతేకాదు.. శనివారం, ఆదివారం వీకెండ్స్ కావడంతో ఈ సినిమా వసూళ్ళు మరింత ఊపందుకునే అవకావాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇటు నార్త్ అమెరికాలోనూ పుష్ప వసూళ్లు బాగున్నాయి. ఆల్రెడీ రెండో రోజు హిందీ బెల్ట్‌లో పుష్ప 2 సినిమాకు 30 కోట్ల రూపాయల టికెట్స్ బుక్ అయ్యాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే హిందీలో పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలె క్షన్స్‌ను రాబట్టేలా కనిపిస్తుంది.

ఇక ‘పుష్ప 2’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయాల బిజినెస్ జరిగింది. ప్రీమియర్స్‌తో కలుసుకుని తొలిరోజు దాదాపు 130 కోట్ల రూపాయల వరకు షేర్‌ను రాబట్టగలిగింది. ఈ సినిమా హిట్ కావాలంటే షేర్ రూపంలో మరో 470 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక టికెట్ రేట్స్ మరో వారం రోజులు ఉండటం, ఆల్రెడీ బుకింగ్స్ వేగంగా జరుగుతుండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఇక ‘పుష్ప 2’ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 420 కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చిన సంగతి తెలిసిందే.