PushpaTheRule 1000 cores Collection: అల్లు అర్జున్ (AlluArjun) ‘పుష్ప ది రూల్ (pushpaTheRule)’ సినిమా వెయ్యికోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘పుష్ప ది రూల్’ సినిమా డిసెంబరు 5న విడుదలైంది. సినిమా రిలీజైన ఆరురోజుల్లోనే ‘పుష్ప ది రూల్’ సినిమా వెయ్యికోట్ల రూపాయల క్లబ్‌లో చేరిందని మేకర్స్ వెల్లడించడం విశేషం.అలాగే వెయ్యికోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్ త్వరగా సాధించిన తొలి ఇండియన్ సినిమాగా ‘పుష్ప 2’ చెబుతున్నారు మేకర్స్. అంతేకాదు..ఈ సినిమాకు హిందీలో అత్యధికంగా 390 కోట్ల రూపాయల గ్రాస్‌కలెక్షన్స్‌ను సాధించిందని మేకర్స్ చెబుతున్నారు.
Pushpa2 Collections: పుష్ప 2 సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి?
ఇక హాయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన ఇండియన్ సినిమాలుగా దంగల్, బాహుబలి: ది కన్‌క్లూజన్, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ ఛాప్టర్2, జవాను, కల్కి2898ఏడీ, పఠాన్’ సినిమాలు ఉన్నాయి. ఈ చిత్రాలన్నీరూ. 1000 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలే (ఆయా చిత్రబృందాల ప్రకటనలమేరకు). రూ. 2000 కోట్లు, రూ. 1810 కోట్లు కలెక్షన్స్‌తో దంగల్, బాహుబలి: ది కన్‌క్లూజన్ సినిమాలు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఇక ఆర్‌ఆర్‌ఆర్, జవాను, కేజీఎఫ్ చాప్టర్2, కల్కి2898ఏడీ, పఠాన్’సినిమాల కలెక్షన్స్ అన్నీ 1000–1300 కోట్ల మధ్యలో ఉన్నవే. విడుదలైన ఆరు రోజుల్లోనే ‘పుష్ప 2’సినిమా వెయ్యికోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. మరో..రూ.300 కోట్ల రూపాయాలను సాధిస్తే ఆర్‌ఆర్‌ఆర్(RRR) రికార్డు బద్దలవుతుంది. ‘పుష్ప 2’ థర్డ్ ప్లేస్‌లోకి వస్తుంది. బహుశా..‘పుష్ప 2’ టీమ్‌ప్లాన్ కూడా ఇదే కావొచ్చు. ఎలాగూ..‘పుష్ప 2’ సినిమా రూ. 2000 కోట్లు, రూ. 1800 కోట్ల రూపాయలమార్క్ చేరుకోవడం చాలా కష్టం. ఆర్‌ఆర్‌ఆర్ రికార్డులను మాత్రం చేరుకోవచ్చు. మరి..ఆర్‌ఆర్‌ఆర్‌నుమించి ‘పుష్ప 2’ కలెక్షన్స్ వస్తాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
pushpa2 Collections: హిందీలో టాప్ ప్లేస్‌కి పుష్ప 2 ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?