రాజాసాబ్ డూప్ ట్రోలింగ్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

Kumar NA

Web Stories

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడమే కాకుండా, సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. ముఖ్యంగా సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత నెటిజన్లు ప్రతి ఫ్రేమ్‌ను జల్లెడ పడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, క్వాలిటీతో పాటు, ప్రభాస్ పాత్ర కోసం చాలా చోట్ల డూప్‌ను వాడారనే వార్తలు ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారగా, ఇప్పుడు ఆ సెగ హీరోయిన్ మాళవిక మోహనన్‌కు కూడా తాకింది.

సాధారణంగా భారీ యాక్షన్ సీన్లలో హీరోలకు డూప్‌లను వాడటం చూస్తుంటాం. కానీ ‘రాజాసాబ్’ చిత్రంలో మాళవిక మోహనన్ చేసిన ఒక పోరాట సన్నివేశంలో ఆమెకు బదులుగా మరొకరిని (డూప్) వాడినట్లు కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో హీరోయిన్లకు కూడా డూప్ అవసరమా? అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. తనపై వస్తున్న నెగటివ్ కామెంట్స్‌పై మాళవిక మోహనన్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

తనకు చిన్నప్పటి నుండి యాక్షన్ అంటే ప్రాణమని, అందుకే ఈ సినిమాలో చాలా వరకు ఫైట్ సీక్వెన్స్‌లు తనే స్వయంగా చేశానని ఆమె తెలిపారు. కేవలం ప్రాణాపాయం లేదా గాయాలయ్యే అవకాశం ఉన్న రిస్కీ షాట్స్ కోసం మాత్రమే ప్రొఫెషనల్ డూప్‌ను ఉపయోగించినట్లు ఆమె స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో నటీనటుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి పద్ధతులు పాటించడం సర్వసాధారణమని, దీన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, మేకింగ్ విషయంలో వస్తున్న విమర్శలకు మాళవిక ఇచ్చిన వివరణతో కొంతవరకైనా క్లారిటీ వచ్చినట్లయింది. మరి మాళవిక వివరణ తర్వాతైనా ‘రాజాసాబ్’ టీమ్‌పై వస్తున్న ఈ ట్రోల్స్ తగ్గుతాయో లేదో వేచి చూడాలి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos