వెబ్‌సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు (DO Prasad Rao Kanabadutaledu Review)
ప్రధాన తారాగణం నటీనటులు రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ , గాయత్రి భార్గవి
దర్శకత్వం: కృష్ణ పోలూరు
నిర్మాత: కేవీ శ్రీరామ్
కెమెరా :కె.మహేశ్‌కుమార్
ఎడిటర్: చంద్రశేఖర్
మ్యూజిక్: డైరెక్టర్ శ్రీరామ్
స్ట్రీమింగ్ డేట్: ఫిబ్రవరి 27 (D/O Prasad Rao Kanabadutaledu Release date)
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: జీ5 (D/O Prasad Rao Kanabadutaledu Series Zee5 Ott)
ఎపిసోడ్స్ 6 (150 mints) (D/O Prasad Rao Kanabadutaledu Series RunTime)
ప్రధాన తారాగణం నటీనటులు రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ , గాయత్రి భార్గవి
దర్శకత్వం: కృష్ణ పోలూరు
నిర్మాత: కేవీ శ్రీరామ్
కెమెరా :కె.మహేశ్‌కుమార్
ఎడిటర్: చంద్రశేఖర్
మ్యూజిక్: డైరెక్టర్ శ్రీరామ్
స్ట్రీమింగ్ డేట్: ఫిబ్రవరి 27 (D/O Prasad Rao Kanabadutaledu Release date)
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: జీ5 (D/O Prasad Rao Kanabadutaledu Series Zee5 Ott)
ఎపిసోడ్స్ 6 (150 mints) (D/O Prasad Rao Kanabadutaledu Series RunTime)
DO Prasad Rao Kanabadutaledu Review: కథ
తిరుపతిలో ప్రసాదరావు (రాజీవ్ కనకాల) జనరల్ కిరాణాస్టోర్ రన్ చేస్తూ, కుటుంబంతో జీవనం సాగిస్తుంటాడు. ప్రసాదరావు ఏకైక కుమార్తె స్వాతి (వాసంతిక) బాగా చదువు కుంటుంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో స్వాతికి ఉద్యోగం వస్తుంది. కానీ స్వాతిని హైదరాబాద్‌కు పంపడం ప్రసాదరావుకు ఇష్టం లేదు. అయితే ప్రసాదరావు బావమరిది, తమ్ముడు, భార్యలు స్వాతికి సపోర్ట్ చేసి, మాట్లాడతారు. దీంతో ప్రసాదరావు కుమార్తెను హైదరాబాద్‌కు పంపేందుకు ఒప్పుకుంటాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్ ఉండే భవానీ హాస్టల్‌లో ఉంటుంది స్వాతి. ఈ హాస్టల్ వార్డెన్ భవానీ (గాయత్రి భార్గవి). సడన్ గా ఉద్యోగంలో జాయిన్ అయిన నెల రోజులకే స్వాతి హైదరాబాద్‌లో చనిపోతుంది. స్వాతి ఎందుకు మరణించింది? పోలీస్ ఆఫీసర్ రెబెక్కా జోసెఫ్ (ఉదయభాను) ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిన షాకింగ్ నిజాలు ఏమిటి? స్వాతిది మర్డర్‌నా? లేక ఆత్మహత్యనా? కుమార్తె మరణం తెలిసిన ప్రసాదరావు ఏం చేశాడు? అన్న ఆసక్తికరమైన విషయాలను జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ‘డాటర్ ఆఫ్ ప్రసాదరావు’ వెబ్ సిరీస్‌లో చూడాలి (D/O Prasad Rao Kanabadutaledu Review),
.
విశ్లేషణ
ప్రసాదరావు తన కుమార్తె ఫోన్ ఎందుకు స్విచ్చాఫ్ వస్తుందో తెలుసుకోవాలని హైదరాబాద్‌కు వెళ్లే సీన్‌తో సిరీస్ మెయిన్ కథాంశం సాగుతుంది. స్వాతి హైదరాబాద్‌కు వెళ్లడం, అక్కడస్వాతి చనిపోవడం వంటి సీన్స్ రెండు ఎపిసోడ్స్‌గా సాగుతుంది. రెండో ఎపిసోడ్ కాస్త థ్రిల్లింగ్ అనిపించి నప్పటీకిని, మొదటి ఎపిసోడ్ కాస్త సాగదీత ధోరణీలోనే, రోటీన్‌గా ఉంటుంది.కానీ స్వాతి చనిపోయిన తర్వాతి నుంచి వచ్చే సన్నివేశాలు వ్యూయర్స్‌కు ఆసక్తికరంగా అనిపిస్తాయి. స్వాతి పోస్ట్‌మాస్టమ్ రిపోర్ట్ సీన్, స్వాతి ఎవరు? అని ఆనంద్ అడిగే సీన్ సిరీస్‌లో థ్రిల్ పాయింట్స్‌గా వ్యూయర్స్ ఫీల్ అవుతారు. అలాగే స్వాతి మరణం వెనక ఉన్న కారణం కూడా కొత్తగానే ఉంటుంది. కానీ స్వాతి చావుకు దారితీసిన పరిస్థితులు మాత్రం నిత్యం మన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలే. కథలో రివెంజ్ ఎలిమెంట్ కూడా ఉంది. అలాగే సందేశం ఉంది.

తండ్రీకూతుళ్ల ఎమోషన్ ఇంకాస్త బాగా ఎస్టాబ్లిష్ కావాల్సింది. రాజీవ్‌కనకాల-వసంతికల మధ్య ఉన్న స్ట్రాంగ్ ఎమోషన్ ఎలిమెంట్స్ స్క్రీన్‌పై కనిపించలేదు. అలాగే సడన్‌గా అనుమానంఅనే టాపిక్‌ను డీల్ చేసిన విషయం ఏస్టాబ్లిక్ కాలేదు. స్వాతి కోసం వాటర్ ట్యాంకర్ దగ్గరకు ప్రసాద్ వెళితే, ఆల్రెడీ ఆ ప్లేస్‌ను చెక్ చేశామని పోలీస్ చెప్పడం ఆర్గానిక్‌గా సూట్ కాలేదు. ట్యాంక్‌పక్కనే స్వాతి కనిపించకపోవడం ఏంటో అర్థం కాదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో కాస్త మైనస్‌లు ఉన్నాయి. ఇంకా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ త్రూ అవుట్ ఉండవు. కథను ఒక్కలాస్ట్ ఎపిసోడ్‌లోనే హడావిడిగా కంప్లీట్ చేసినట్లుగా అనిపించొచ్చు.
నటీనటులు-సాంకేతిక నిపుణులు
ఎన్నో తండ్రి పాత్రలు పోషించిన రాజీవ్ కనకాలకు మరోసారి తండ్రి పాత్ర పోషించారు. యాక్టింగ్ పరంగా తన స్టైల్ ఆఫ్ మార్క్ చూపించారు. ముఖ్యంగా లాస్ట్ ఎపిసోడ్‌లో రాజీవ్ కనకాల యాక్టింగ్ మరోసారి మెప్పిస్తుంది. స్వాతి పాత్రలో వసంతిక ఫర్వాలేదు. ఎమోషనల్ సీన్స్‌లో ఒకే అనిపించారు. భవానీగా గాయత్రీభరద్వాజ్ రోల్ చేశారు.కథలో వెయిట్ ఉంది. కానీ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువనే చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ రెబెక్కాగా ఉదయభానుకు మంచి రోల్ లభించింది. ఉదయభాను బాగానే యాక్ట్ చేశారు. సుజాత, రమేష్, జెమినీ సురేష్…వంటి వారు వారి వారి పాత్రల పరిధిమేరకు యాక్ట్ చేశారు.
ఇక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్‌కు సందేశాన్ని జోడించి దర్శకుడు కొంతవరకు బాగానే ఈ సిరీస్‌ను తీశారు. కానీ ఎండింగ్‌లో సీన్ కాస్త మలయాళ ద్రుశ్యం సినిమా సీన్స్ సిరీస్ ఎండింగ్‌లో గుర్తొస్తాయి. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ రోటీన్‌గా అనిపించింది. ఇలాంటి క్రైమ్‌స్టోరీస్‌ను
తెలుగు ప్రేక్షకులు ఆల్రెడీ చాలానే చూశారు. విలన్ ఎవరు అనేది రెగ్యులర్ క్రైమ్ జానర్ చూసే ఆడియన్స్ ఊహించగలరు. ఓ అమ్మాయి చనిపోయి ఇన్వేస్టిగేషన్ జరుగుతుంటే, ఆ అమ్మాయి తాలుకూ ఫోన్ వంటి వస్తువులను పోలీసులు పరీశీలించే మినిమిమ్ థియరీ ఎందుకు ఈ సిరీస్‌లో మిస్ అయ్యారో అన్నది చిన్నపాటి సందేహమే. మ్యూజిక్ ఆర్‌ఆర్ బాగుంది. ఎడిటింగ్ ఒకే. విజువల్స్ ఫర్వాలేదు. లిమిటెడ్ లొకేషన్స్‌లోనే సిరీస్‌ను కంప్లీట్ చేసినట్లుగా తెలుస్తుంది. నిర్మాణ విలువలు ఒకే.

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సిరీస్‌ను ఆడియన్స్ ఓసారి చూసే ప్రయత్నం చేయవచ్చు. కానీ ఫుల్లీ శాటిస్‌ఫై అవుతారని చెప్పలేం. థ్రిల్లర్ జానర్ చూసే ఆడియన్స్‌ను ఈ సిరీస్ పెద్దగా ఎగ్జైట్ చేయకపోవచ్చు. రన్ టైమ్ తక్కువే. అమ్మాయితో కూడిన క్రైమ్ ఎలిమెంట్ సినిమాలో ఉన్నా, దర్శకుడు స్క్రీన్‌పై అశ్లీలత జోలికి పోలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్లో చూసేందుకు ప్రాబ్లమ్ అయితే లేదు.