సూడ్మే…ఆటే నా పొగరు

Viswa
1 Min Read

Web Stories

Ram Charan’s Peddi Pehlwan: రామ్‌చరణ్‌ హీరోగా చేస్తున్న లేటెస్ట్‌ పీరియాడికల్‌ విలేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘పెద్ది’ (Peedi). ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్‌ కంటెంట్‌లో రామ్‌చరణ్‌ క్రికెటర్‌గానే కనిపించారు. అయితే రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా అంటే మార్చి 27న ‘పెద్ది’ పెహిల్వాన్‌ అంటూ, ఓ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ వీడియోలో రామ్‌చరణ్‌ కుస్తీ క్రీడాకారుడిగా కని పించారు. ఈ వీడియోకు ఆడియన్స్‌ నుంచి మంచి పాజటివ్‌ రెస్పాన్స్‌ లభిస్తుంది. అలాగే రామ్‌చరణ్‌ పెద్ది సినిమాలో, క్రికెట్‌, కుస్తీతో పాటుగా, ఇతర క్రీడల ప్రస్తావన కూడా ఉం టుందనే టాక్‌ నిజమౌతున్నట్లుగా ఉంది. ‘పెద్ది’ పెహీల్వాన్‌ వీడియోలో చరణ్‌ ‘సూడ్మే..ఆటే నా పొగరు’ అంటూ రామ్‌చరణ్‌ డైలాగ్‌ చెబుతుంటే, చరణ్‌ ఫ్యాన్స్‌ విజిల్‌ వర్తీ మూమెంట్‌లా ఫీలవుతున్నారు.

అనకున్నట్లుగా షూటింగ్‌ జరిగి ఉంటే…’పెద్ది’ సినిమా మార్చి 27నే థియేటర్స్‌లో విడుదలై, ఉండేది. కానీ ఈ సినిమాను ఏప్రిల్‌ 30కి (Peddi Movie Release date) వాయిదా వేశారు. ఇప్పటికీ ఇంకా సాంగ్‌ షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉంది. దీంతో, ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న అయిన విడుదల అవుతుందా? అనే విషయంపై సరైన క్లారిటీ రావడం లేదు. అయితే ‘పెద్ది’ టీమ్‌ మాత్రం ఏప్రిల్‌ 30నే, తమ సినిమాను రిలీజ్‌ చేయాలని అహర్నిషలు కష్టపడుతోంది. మరోవైపు ‘పెద్ది’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు ఏఆర్‌ రెహహాన్‌ సంగీతం అందిస్తున్నారు. జాన్వీకపూర్‌, శివరాజ్‌కుమార్‌, జగపతిబాబు ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై వెంకట సతీష్‌ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత సుకుమార్‌తో సినిమా చేస్తారు చరణ్‌. ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్‌తో చరణ్‌ చేయనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.

Please Share
Share This Article
11 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu