హృతిక్‌రోషన్, ఎన్టీఆర్‌లు కలిసి యాక్ట్ చేసిన ‘వార్ 2’ (War2) మూవీ ఈ ఆగస్టు 14 రిలీజ్ డేట్‌ను ఇటీవల కన్ఫార్మ్ చేసింది. లేటెస్ట్‌గా ఇదే రిలీజ్ డేట్‌ను రజనీకాంత్ ‘కూలీ’ (Coolie) సినిమా కూడా కన్ఫార్మ్ చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ ఇండిపెండెన్స్ డేకి బాక్సాఫీస్ వార్ ఖరారైపోయింది.
ముందు నుంచే ‘వార్ 2’, ‘కూలీ’ సినిమాలు ఒకేరోజు విడుదల అవుతాయన్న వార్తలు వచ్చాయి. కానీ ఓ దశలో రజనీకాంత్ ‘కూలీ 2’ మూవీ రిలీజ్ దసరాకు ఉండొచ్చనే పుకార్లు వచ్చాయి. తాజాగా ‘కూలీ’ రిలీజ్ డేట్ అధికారిక అనౌన్స్‌మెంట్ రాగానే…కూలీ దసరాకు రిలీజ్ అన్న పుకార్లు నిజమైన పుకార్లుగా మిగిలి పోయాయి.
బ్రహాస్త్ర మూవీ తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్‌రోషన్, ఎన్టీఆర్‌లు కలిసి యాక్ట్ చేస్తున్న ‘వార్ 2’ మూవీని ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌కు స్ట్రయిట్ హిందీ ఫిల్మ్ ఇది. ఈ వార్ 2 మూవీలో ఎన్టీఆర్ నెగటివ్‌షేడ్స్ ఉన్న రోల్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది.
ఇక ‘జైలర్’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత రజనీకాంత్ నుంచి రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కూలీ’. తమిళ యువదర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేయగా, సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్ వంటి బలమైన నటీనటులు ఈ మూవీలో భాగమైయ్యారు. అనిరు«ద్ స్వరకర్త.
మరి…బాక్సాఫీస్ వద్ద ‘వార్ 2’ మూవీ విజయం సాధిస్తుందా? లేక రజనీకాంత్ కూలీ విన్నర్‌గా నిలుస్తాడా? అనేది తెలియాలంటే చాలాకాలం టైమ్ ఉంది.