వార్‌ 2 వాయిదా?…క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌

War2 Movie : హృతిక్‌రోషన్, జూనియర్‌ ఎన్టీఆర్‌లు యాక్ట్‌ చేస్తున్న ‘వార్‌ 2’ సినిమా విడుదలపై మేకర్స్‌ ఓ క్లారిటీ ఇచ్చారు.

Viswa
1 Min Read
NTR 2025

Web Stories

హృతిక్‌రోషన్, ఎన్టీఆర్‌లు లీడ్‌ రోల్స్‌లో యాక్ట్‌ చేసిన స్పై యాక్షన్‌ ఫిల్మ్‌ ‘వార్‌ 2’ (War2 Movie). ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘వార్‌ 2’ సినిమాను తొలుత 2025 జనవరి 26న రిలీజ్‌కు ప్లాన్‌ చేశారు. కానీ ఆ తర్వాత 2025 ఆగస్టు 14కి వాయిదా వేశారు.

వాయిదాపై మేకర్స్‌ క్లారిటీ!

కానీ ‘వార్‌ 2’ సినిమా విడుదల వాయిదా పడందని, ఈ తేదీకి రజనీకాంత్‌ ‘కూలీ’ సినిమా థియేటర్స్‌లోకి రానుందనే టాక్‌ బాలీవుడ్‌లో తెరపైకి వచ్చింది. దీంతో ‘వార్‌ 2’ నిర్మాణసంస్థ వైఆర్‌ఎఫ్‌ (యశ్‌రాజ్‌ఫిల్మ్స్‌)ఈ విషయంపై స్పందించింది. ‘వార్‌ 2’ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 14నే విడుదల చేస్తున్నట్లుగా కన్ఫార్మ్‌ చేసింది. దీంతో ఎన్టీఆర్, హృతిక్‌ ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీలవుతున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరో యిన్‌గా చేస్తున్నారు.

వార్‌కి సీక్వెల్‌

సిద్దార్థ్‌ ఆనంద్‌ డైరెక్షన్‌లో హృతిక్‌రోషన్, టైగర్‌ష్రాఫ్‌లు ప్రధాన పాత్రల్లో యాక్ట్‌ చేసిన స్పై మూవీ ‘వార్‌’. 2019లో విడుదలైన ఈ మూవీ, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ‘వార్‌ 2’ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు వైఆర్‌ఎఫ్‌ సంస్థ వాళ్లు. కానీ దర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్‌ ప్లేస్‌లో అయాన్‌ ముఖర్జీ వచ్చి చేరాడు. ‘వార్‌ 2’ మూవీలో కబీర్‌సింగ్‌ పాత్రలో హృతిక్‌రోషన్, వీరేంద్రనాథ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ కనిపిస్తారు. వీరేంద్రనాథ్‌ పాత్రలో కాస్త నెగటివ్‌ షేడ్స్‌ కనిపిస్తాయి.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Manasa Varanasi Shivani Nagaram Heroine Nabanatesh Latest Pics Krithishetty Ritika Nayak