మెగా వారసుడు వచ్చేశాడు…కవలలకు జన్మనిచ్చిన రామ్ చరణ్ – ఉపాసన దంపతులు

Viswa
2 Min Read

Web Stories

ram charan upasana children: మెగా వారసుడు వచ్చేశాడు. రామ్‌చరణ్‌ (ram charan) మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య ఉపాసన (upasana kamineni) హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో జనవరి 31న కవలకు (ఒక పాప, ఒక బాబు) జన్మనిచ్చారు (ram charan upasana children). ఈ సంతోషకరమైన విషయాన్ని చిరంజీవి తన సోషల్‌మీడియా మాధ్యమం ట్విటర్‌ వేదికగా అధికారికంగా వెల్లడించారు (chiranjeevi twins announcement)

‘‘ రామ్‌చరణ్‌–ఉపాసన దంపతులకు కవలలు జన్మించారని మేం సంతోషంగా తెలియ జేస్తున్నాం. తల్లి, బిడ్డలు సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ చిన్నారులను మా కుటంబం లోకి స్వాగతిండం అనేది తాత–నాన్నమ్మలుగా మాకు ఎంతో స్వచ్ఛమైన ఆనందాన్ని కలిగి స్తుంది. మా కుటుంబం కోసం ప్రార్థనలు చేసిన, ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’’ అంటూ చిరంజీవి, ఆయన భార్య సురేఖ సంయుక్తంగా ఓ ప్రకటనను జారీ చేశారు ( ram charan baby boy girl).

దీంతో మెగా కాంపౌడ్‌లో సంతోషాలు అంబరాన్ని అంటాయి. ఇటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ, ఇతర రంగ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా, రామ్‌చరణ్‌–ఉపాసనలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఎప్పట్నుంచో మెగా వారసుడి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగాఫ్యాన్స్‌ హ్యాపీ ఫీలవుతున్నారు.

రామ్‌చరణ్‌–ఉపాసనలు 2012లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2023 జూన్‌ 20న ఓ పాప జన్మించగా, ఈ పాపకు క్లీంకార అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు… ఈ తరం యాక్టర్స్‌లో ముగ్గురు పిల్లలు కలిగిన వ్యక్తిగా రామ్‌చరణ్‌ నిలిచారు (upasana twins).

ఇక సినిమాల విషయానికి వస్తే…రామ్‌చరణ్‌ నటించిన మల్టీస్పోర్ట్స్‌ పీరియాడికల్‌ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమా ‘పెద్ది’ మే 1న రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు సరిగా జరగని పక్షంలో ఈ సినిమాను ఈ దసరాకు విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది.

ఆలాగే చిరంజీవి హీరోగా నటించిన ‘మనశంకరవరప్రసాద్‌గారు’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం, ఇప్పుడు రామ్‌చరణ్‌కు ట్విన్స్, మరోవైపు పవన్‌కల్యాణ్‌ ‘ఉస్తాద్‌భగత్‌సింగ్‌’ సినిమా రిలీజ్‌కు సిద్ధం కావడం వంటి విశేషాలు..మెగాఫ్యాన్స్‌కు మంచి కిక్‌ ఇస్తున్నాయనే చెప్పవచ్చు. ఫైనల్‌గా…చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రం కూడా ఈ ఏడాది జూలై 12న రిలీజ్‌కు సిద్ధం అవుతుంది.

Please Share
Share This Article
4 Comments
Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu