Toxic Review and Rating: ‘కేజీఎఫ్: చాఫ్టర్ 1’ (2018), ‘కేజీఎఫ్: చాఫ్టర్ 2 (2022)’ సినిమాల తర్వాత హీరో యశ్ హీరోగా నటిం చిన తాజా సినిమా ‘టాక్సిక్:ఏ ఫెయిరీ టెయిల్ ఫర్ గ్రోన్ అప్స్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ సినిమాలతో అద్భుతమైన క్రేజ్, స్టార డ్‌మను సొంతం చేసుకున్న యశ్‌కు, ‘టాక్సిక్’ సినిమా రూపంలో మరో హిట్ లభించిందా? రివ్యూలో చదివేద్దాం.
సినిమా:‘టాక్సిక్:ఏ ఫెయిరీ టెయిల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Yash Toxic Review )
ప్రధాన తారాగణం: యశ్, కియారా అద్వానీ, రుక్మిణీవసంత్, తారా సుతారియా,హ్యూమాఖురేషి, డారెల్లీ డిసిల్వా, సుదేవ్ నాయర్, అక్షయ్ ఓబెరాయ్, అమిత్ తివారి
దర్శకురాలు: గీతూ మోహన్‌దాస్
నిర్మాత: వెంకట్.కె నారాయణ, యశ్
సంగీతం: విశాల్ మిశ్రా, రవి బస్రూర్, తానిష్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా, అర్సలాన్ నిజామి
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
కెమెరా: రాజీవ్ రవి
విడుదల తేదీ: ఆగస్టు 27, 2026
నిడివి: 3 గంటల 14 నిమిషాలు
రేటింగ్:2/5 (Toxic Review and Rating)
కథ (Toxic story)
గంగ (నయనతార), రాయ (యశ్) అక్కాతమ్ముళ్లు. వీరిద్దరి చిన్నతనంలోనే అమ్మానాన్నలకు దూరమై పోతారు. రాయ బాధ్యతను గంగ తీసు కుంటుంది. గోవాను రాయ శాసించాలనేది గంగ ఆకాంక్ష. కానీ గంగ–రాయలు గోవాలోని గ్యాంగ్‌స్టర్ సాల్వేదర్ (డారెల్లీ డిసిల్వా) దగ్గర పని చేస్తుంటారు. సాల్వేదర్ కుమార్తె రెబెక్కా(తారా సుతారియా)తో రాయ పెళ్లి నిశ్చయం అవుతుంది. మరోవైపు అదే సమయంలో రాయల్ సర్కస్‌ను నిర్వహించే నాడియా(కియారా అద్వానీ)ను ప్రేమిస్తాడు రాయ. నాడియా గర్భవతి అవుతుంది. దీంతో తన కుమార్తె రెబెక్కాతో రాయ వివాహం జరి పించి, అనంతరం నాడియాను చంపాలను కుంటాడు సాల్వేదర్. కానీ సాల్వేదర్‌ను రాయ చంపేస్తాడు. గోవాకు కింగ్ అవుతాడు. కానీ నాడియాను మాత్రం దూరం పెడతాడు? తన ప్రేయసి నాడియాను రాయ దూరం పెట్టడానికి కారణం ఎవరు? రాయ జీవితంలోకి మెలిస్సా (రుక్మీణీవసంత్) ఎలా వచ్చింది? గంగకు ఎలిజబెత్ (హ్యూమాఖురేషీ)కి ఉన్న వైరం ఏమిటి? ఈ వైరం రాయ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? అన్నది సినిమాలోని మిగిలిన కథ.
విశ్లేషణ
1947–1967 మధ్య కాలంలో జరిగే పీరియాడికల్ సినిమా ఇది. భారతదేశం అంతా స్వాతంత్య్రం లభించి నప్పటికీని, గోవాలో మాత్రం పోర్చుగీసు వారి పాలనే నడుస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో గోవాలో జరి గే కథే ‘టాక్సిక్’ సినిమా.

కథ పరంగా సినిమాలో ఎమోషన్స్‌కు కొదవలేదు. రాయ పశ్చాత్తాపం, గంగ త్యాగం, నాడియా ఆవేదన, ఎలిజెబెత్ పగ, మెలిస్సా తొందరపాటు…ఇలా చెప్పుకోవడానికి మంచి ఎమోషన్స్‌నే ఉన్నాయి. కానీ ఈ ఎమోషన్స్‌ను స్క్రీన్‌పై ప్రజెంట్ చేసిన తీరు బాగోలేదు. మితిమీరిన హింస, శ్రుతిమించిన శృంగార సన్ని వేశాలు, హీరో ఇమేజ్‌ను ఎలివేట్ చేయడానికి ఉన్న అనవసరమైన సన్నివేశాలు కథలోని కోర్ ఎమోషన్‌ను కప్పిపెట్టాయి. ఈ కోటింగ్‌కు తోడు మూడు గంటల నిడివి, ప్రేక్షకుల సహనాన్ని థియేటర్స్‌లో పరీక్షిస్తుంది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో టికెట్ క్యారెక్టర్‌ను ప్రజెంట్ చేసిన తీరు, ముగించిన తీరు ఏ మాత్రం ఆడి యన్స్‌ను మెప్పించక పోగ, చిరాకు తెప్పిస్తుంది. ఇంకా మకావులో క్యాసినో అంటూ అదొ అర్థం పర్థం గోల ఎక్స్‌ట్రా తలపోటు.కథతో పాటు, కథనం, క్లైమాక్స్‌లోనూ కొత్తదనం లేకపోవడం ఆడియన్స్‌ను మరింత నిరాశ పరుస్తుంది. థియేటర్స్‌కు ‘టాక్సిక్’గా అనిపిస్తుంది.
నటీనటులపెర్ఫార్మెన్స్
ఈ సినిమా కథనం రాయ జర్నీలా కనిపిస్తుంది. రాయ, టికెట్…ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో యశ్ యాక్టింగ్ ఒకే. కానీ ‘కేజీఎఫ్’ ప్రపంచం నుంచి యశ్ ఇంకా పూర్తిస్థాయిలో బయటకు రానన్నట్లు ఉన్నాడు. ఈ సినిమా దర్శకురాలు గీతూమోహన్‌దాస్‌తో కలిసి యశ్ ఈ సినిమాకు కథ అందించాడు. మరి..యశ్ ఇన్‌పుట్స్ ఏవీ సఫలం కాలేదని, సినిమా రిజల్ట్ చెప్పకనే చెబుతోంది. నాడియా రోల్‌లో కియారా గ్లామర్
స్క్రీన్‌పై బాగానే పండింది. ఎక్కువగా శృంగార సన్నివేశాలకే, ఈ పాత్ర పరిమితమైపోయింది. గంగ పాత్ర లో నయనతార ఒకే. కథను కీలక మలుపు తిప్పే పాత్రలో మెరిశారు. కానీ ఈ పాత్రలో కొత్తదనం లేదు. నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో హ్యూమా, మరో గ్లామర్‌గాళ్‌గా రుక్మిణీవసంత్ కనిపించారు. తారా సుతారియాను గ్లామర్ కోసమే తీసుకున్నారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. సుదేశ్ నాయర్, డారెల్లీ డిసిలా, అమిత్ తివారి, అక్షయ్ ఒబెరాయ్..వారి వారి పాత్రల పరిధిమేరకు నటించారు.

దర్శకురాలిగా గీతూమోహన్‌దాస్ పూర్తిస్థాయిలో విఫలం అయ్యారు. కథను సరైన విధంగా ప్రజెంట్ చేయలేదు. మ్యూజిక్ సౌండ్ ఎక్కువైంది. కథకు ప్లస్ కాలేదనిపించింది. విజువల్స్, నిర్మాణవిలువలు బాగున్నాయి. నిడివి ఇంకాస్త తగ్గించవచ్చు.
బలం
యశ్ యాక్టింగ్
విజువల్స్
బలహీనతలు
కొత్తదనం లేని కథ, కథనాలు
ఓవర్ ఎలివేషన్స్
శ్రుతిమించిన శృంగార సన్నిశాలు….
ఇంకా…
ఫైనల్‌గా..: టాక్సిక్…థియేటర్స్‌లో ఆడియన్స్‌కు కూడా టాక్సిక్‌నే.
hbERrYpvvbouWcpanYDJpZs
The slot games here are so exciting and the jackpots are actually reachable. I had a great run last night at nibung88slot.
so much good info on here, :D.
Downloading the app made a huge difference. Now I can play my favorite games anywhere on the go via jilikingapp.
Best slot experience I have had in a while. The graphics are great and the gameplay is very addictive. Love spending my weekends on rj777slot
Keepp his ging please, great job! xnxx
The download process was a breeze and the app runs perfectly on my phone. No lags and the graphics are crisp. Cheers to r777gamedownload
I’ve tried a few platforms but this one is really smooth. The interface is intuitive and the payouts are fast. Definitely recommend phjiliapp to anyone looking for a reliable spot.
I’m really enjoying the variety of themes on ph666jili. It is a fun place to unwind after work and try my luck. The graphics are sharp and the gameplay is fluid.
Great insights on pharmacokinetic bioavailability and active compound titration. It is refreshing to see such detailed pharmacological breakdowns rather than generic summaries.
You have observed very interesting points! ps nice website .