వెంకీ సినిమా..జనవరి13న విడుదల?

Viswa
1 Min Read

Web Stories

Janavari 13na Vidudala: అనిల్‌ రావిపూడి (Director AnilRavipudi)  టాలీవుడ్‌ వన్నాఫ్‌ ది మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్‌లో ఒకరు. ముఖ్యంగా సంక్రాంతి సమ యంలో వచ్చిన అనిల్‌రావిపూడి సినిమాలు కలెక్షన్స్‌ పరంగా బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు ఈ క్రేజీ డైరెక్టర్‌ వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌లను హీరోలు పెట్టి, ఓ మల్టీస్టారర్‌ మూవీ చేస్తున్నారు. ఆల్మోస్ట్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది.

ఈ నెల 15న ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుందని సమాచారం. అలాగే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ జూన్‌ నెల 22 నుంచి ఆరంభం కానుందని తెలిసింది. అయితే, ఈ సినిమా సెట్స్‌లో ముం దుగా వెంకటేశ్‌ పాల్గొనరట. తొలి షెడ్యూల్‌లో వెంకటేశ్‌ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారట అనిల్‌రావిపూడి.ప్రస్తుతం త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లోని ‘ఏకే 47’ సినిమా షూటింగ్‌తో వెంకటేశ్‌ బిజీగా ఉండటమే ఇందుకు కారణం.

ఇవన్నీ పక్కన పెడితే..ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ టైటిల్‌ను లాక్‌ చేశారట అనిల్‌రావిపూడి. ఈ సినిమాకు ‘జనవరి 13న విడుదల’ అనే టైటిల్‌ను (Janavari 13na Vidudala title) ఆల్మోస్ట్‌ ఫిక్స్‌ చేశారట. టైటిల్‌నే ఇలా పెట్టారంటే..ఈ సినిమానూ ‘జనవరి 13నే రిలీజ్‌ చేసేలా, అనిల్‌రావిపూడి ప్లాన్‌ చేస్తారని ఊహించవచ్చు.

జీ స్టూడియోస్, షైన్‌ స్క్రీన్స్‌ ప్రొడక్షన్స్, సురేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సాహుగారపాటి, డి.సురేష్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక వచ్చే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్‌కు సిద్ధం అవుతున్న తరుణంలో, అనిల్‌రావిపూడి ఈ సారి ఎలాంటి సినిమా తీయబోతున్నారన్న చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది.

Please Share
Share This Article
109 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu