thalaivar 173 Director: రజనీకాంత్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లోని సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రజనీకాంత్ కెరీర్‌లోని ఈ 173వ సినిమాను (thalaivar 173 Director) కమల్‌హాసన్ నిర్మిస్తారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో (Rajinikanth) పాటుగా, కమల్‌హాసన్ (Kamalhaasan) కూడా కలిసి నటించే అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై మొదట్నుంచి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
తొలుత లోకేష్ కనగరాజ్, ప్రదీప్ రంగనాథన్, నెల్సన్ దిలీప్ కుమార్…వంటి వాళ్ల పేర్లు వినిపించినప్పటికీని, ఫైనల్‌గా సుందర్.సి ఈ సినిమా డైరెక్టర్‌గా కన్ఫార్మ్ అయ్యారు. ఏం జరిగిందో, ఏమో తెలియదు కానీ..రజనీకాంత్ సినిమాకు సుందర్.సి దర్శకత్వం వహిం చనున్నారనే ప్రకటన వచ్చిన వారంలోపే…సుందర్.సి (Sundar.C out From thalaivar 173 Movie) తప్పుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా, ఈ ప్రాజెక్ట్ నుంచి సుందర్.సి తప్పుకోవడంతో, ఇప్పుడీ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే చర్చ కోలీవుడ్‌లో జరుగుతుంది.
ఈ తరుణంలో దర్శక–నిర్మాత, నటుడు ధనుష్ పేరు తెరపైకి వచ్చింది. రజనీకాంత్ 173వ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగు తుంది. ఒకవైపు నటుడిగా ఉంటూనే, ఇప్పటికే నాలుగు సినిమాలకూ దర్శకత్వం వహించారు ధనుష్. వీటిలో మూడు సినిమాల్లో ధనుష్ హీరో గా నటించాడు. మరి..తాను హీరో కాకుండ, ఓ స్టార్ హీరోని ధనుష్ ఏ స్థాయిలో డైరెక్ట్ చేస్తాడు? వరుస సినిమాలతో యాక్టర్‌గా బిజీగా ఉండే ధనుష్…. తన మావయ్య రజనీకాంత్ (రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ను ధనుష్ వివాహం చేసుకోగ, వీరు గతంలోనే విడాకులు తీసుకున్నారు). ‘తలైవర్ 173’ సినిమాను దర్శకుడిగా టేకప్ చేయగలడా? అనే ఎన్నో ప్రశ్నలకు త్వరలోనే సమాధానం రానుంది.
ఇక ధనుష్ హీరోగా నటించిన హిందీ మూవీ ‘తేరే ఇష్క్ మే’ చిత్రం ఈ నెల 28న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కృతీసనన్ హీరోయిన్‌గా నటించింది. ఆనంద్.ఎల్. రాయ్ ఈ సినిమాకు దర్శకుడు.