రజనీకాంత్ (rajinikanth) లేటెస్ట్ మూవీ ‘కూలీ (Coolie)’ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ఈ కూలీ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఒక్కొక్క పాటను విడుదల చేస్తున్నారు మేకర్స్. ‘కూలీ’ నుంచి తొలుత విడుదలైన ‘చిటుక్కు…’ పాటకు శ్రోతల నుంచి పెద్దగా ఆదరణ లభించక పోయినా, ఆ నెక్ట్స్ వచ్చిన పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ ‘మోనికా..’ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమా రీచ్‌కు, ఇది బాగా ఉపయోగపడింది. తాజాగా కూలీ సినిమా నుంచి ‘కూలీ పవర్‌హౌస్’ లిరికల్ సాంగ్ (Coolie power house Song) విడుదలైంది. ఈ పాట లిరిక్స్ మాస్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి. అనురుథ్ రవిచందర్ (MusicDirector Anirudh) సూపర్భ్ మ్యూజిక్ ఇచ్చాడు. ‘జైలర్’ సినిమా విషయంలో అనిరుథ్ మ్యూజిక్ బాగా వర్కైట్ అయ్యింది. ఇప్పుడు కూలీ విషయంలోనూ అనిరుధ్ మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యేలా ఉంది. ఇక ఈ కూలీ సినిమాలో నాగార్జున విలన్‌గా నటించగా, శ్రుతీహాసన్, షౌబిన్ షాహిర్, ఉపేంద్ర, సత్యరాజ్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 14న కూలీ చిత్రం విడుదల కానుంది.
హరిహరవీరమల్లు సినిమా బిజినెస్, బ్రేక్‌ఈవెన్ అండ్ టికెట్ రేట్స్ డీలైట్స్